నీళ్లు చిందవిక!

చిన్నచిన్న గిన్నెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేస్తాం. లేదంటే సింక్‌ చుట్టూ  పేరుకుపోయి వికారంగా కనిపిస్తాయి. కడిగే పని తేలిగ్గానే అయిపోతుంది.

Published : 13 Jan 2024 23:59 IST

చిన్నచిన్న గిన్నెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేస్తాం. లేదంటే సింక్‌ చుట్టూ  పేరుకుపోయి వికారంగా కనిపిస్తాయి. కడిగే పని తేలిగ్గానే అయిపోతుంది. కానీ.. చుట్టూ నీళ్లు చిందడం, దుస్తులు తడవటమే చిరాకు తెప్పిస్తుంది. ఆ బాధ నుంచి తప్పించేందుకు ‘స్ల్పాష్‌ గార్డ్‌ బోర్డ్‌’ వచ్చేసింది. దీన్ని సింక్‌కు అమర్చితే.. ఇక నీళ్లు చిందవు. నాణ్యమైన మెటీరియల్‌తో తయారై నందున ఎక్కువ కాలం మన్నుతుంది. ఇదెంత మెత్తగా ఉంటుందంటే.. అమర్చేటప్పుడు, తీసి శుభ్రం చేసేటప్పుడు చేతులకు ఇబ్బంది ఉండదు. స్టీలు, చెక్క కాదు కనుక తుప్పుపట్టదు. అరిటాకు లాంటి ఈ సాధనం వంటింటి అందాన్నీ పెంచుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని