రెండు వైపులా కడిగేయొచ్చు..

సీసాల్లో పచ్చళ్లు భద్రపరచుకోవడం బాగుంటుంది. కానీ వాటిని కడగటం మాత్రం చాలా కష్టమే. అందుకోసం బ్రష్‌లు ఉన్న మాట నిజమే అయినా పేరుకున్న జిడ్డు, మురికి ఒక పట్టాన వదలవు.

Published : 21 Jan 2024 00:03 IST

సీసాల్లో పచ్చళ్లు భద్రపరచుకోవడం బాగుంటుంది. కానీ వాటిని కడగటం మాత్రం చాలా కష్టమే. అందుకోసం బ్రష్‌లు ఉన్న మాట నిజమే అయినా పేరుకున్న జిడ్డు, మురికి ఒక పట్టాన వదలవు. ఈ ఇబ్బందిని తప్పించడానికి వచ్చిందే రెండు వైపులా బ్రష్‌ ఉన్న గ్లాస్‌ వాషర్‌. దట్టంగా ఉన్న ఈ కుంచె సీసా లోపలే కాకుండా.. బయటి భాగాన్ని కూడా క్షణాల్లో శుభ్రం చేస్తుంది. ఇది పీవీసీ మెటీరియల్‌తో తయారైనందున ఎక్కువకాలం మన్నుతుంది. మరీ మెత్తగా లేదా గట్టిగా లేనందున.. తేలిగ్గా వంగుతుంది. వాటర్‌ బాటిల్స్‌, టీ కెటిల్స్‌ను కూడా దీనితో తేలిగ్గా కడిగేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని