అతి పెద్ద నిమ్మకాయ

మనందరికీ తెలిసిన నిమ్మ కాయలు చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. కానీ మాక్సిన్‌ షరఫ్‌ పోస్ట్‌ చేసిన నిమ్మకాయ చాలా పెద్దగా, అనేక వంకరలతో ఉండి.. ఒక్క రోజులోనే రెండున్నర కోట్ల వ్యూస్‌తో వైరలైంది.

Published : 28 Jan 2024 00:25 IST

నందరికీ తెలిసిన నిమ్మ కాయలు చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. కానీ మాక్సిన్‌ షరఫ్‌ పోస్ట్‌ చేసిన నిమ్మకాయ చాలా పెద్దగా, అనేక వంకరలతో ఉండి.. ఒక్క రోజులోనే రెండున్నర కోట్ల వ్యూస్‌తో వైరలైంది. ఎక్కువ మంది ప్రశంసలు కురిపించినా, కొందరు చిత్రమైన ఆకృతులు చూస్తే కలిగే ‘టైప్రోఫోబియా’ అనే భయానికి గురయ్యారట. ‘మాక్సీస్‌ కిచెన్‌’ అకౌంట్‌లో ఇన్‌స్టాలో పోస్టయిన ఈ రీల్‌కు ఇప్పటిదాకా ఇరవై ఒక్క లక్షల లైక్స్‌ వచ్చాయి. ‘ఈ నిమ్మరసం చాలాకాలం వస్తుందిగా’, ‘మహా అద్భుతం’ అంటూ మెచ్చుకునేవారితో పాటు తమను భయాందోళనలకు గురిచేస్తోందంటూ వాపోయిన వారూ ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని