ఇది సంచి కాదు.. నీళ్ల సీసా

పిల్లల నీళ్ల సీసాలు ఒకరివి మరొకరికి మారిపోతుంటాయి. అలా మారకూడదంటే అది ఇతర్లకంటే ప్రత్యేకంగా ఉండాలి- అనుకుందో తల్లి. అంతే.. ఒక ముచ్చటగొలిపే బాస్కెట్‌ను వాటర్‌ బాటిల్లా మార్చేసింది.

Updated : 28 Jan 2024 06:13 IST

పిల్లల నీళ్ల సీసాలు ఒకరివి మరొకరికి మారిపోతుంటాయి. అలా మారకూడదంటే అది ఇతర్లకంటే ప్రత్యేకంగా ఉండాలి- అనుకుందో తల్లి. అంతే.. ఒక ముచ్చటగొలిపే బాస్కెట్‌ను వాటర్‌ బాటిల్లా మార్చేసింది. ఎలాగంటారా.. పుచ్చ, అనాస పండ్ల జ్యూస్‌కు నీళ్లు, ఐస్‌క్యూబ్స్‌, నిమ్మరసం జతచేసి.. హ్యాండిల్స్‌ ఉన్న ప్లాస్టిక్‌ బుట్టలో పోసి, ఎంచక్కా స్ట్రా అమర్చింది. అది పల్చటిది కావడంతో లోపలి జ్యూస్‌ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ నోరూరిస్తోంది. ఇక తాగకుండా ఉండగలడా చిచ్చరపిడుగు?! ‘మా అబ్బాయి దీన్ని తన స్నేహితులకు గర్వంగా చూపిస్తాడు, ఎక్కడా మర్చిపోడు కూడా’ అంటూ సంతోషంగా చెబుతోందామె. నీళ్లు లేదా పండ్ల రసాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు ఇలాంటి హంగులూ ఆర్భాటాలూ అవసరమే మరి. ‘ఇట్స్‌ గుడ్‌ బై ట్వంటీస్‌’ అకౌంట్‌లో ‘మై సన్స్‌ న్యూ స్కూల్‌ వాటర్‌ బాటిల్‌’ పేరుతో ఇన్‌స్టాలో పోస్టయిన ఈ రీల్‌కు ఐదున్నర లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. అలాగే సరదా సరదా కామెంట్స్‌ వహ్వా అనిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని