దోశకి పదో ర్యాంక్‌

మినప్పిండి, బియ్యప్పిండిలతో కరకరలాడే దోశలు ఇష్టపడని వాళ్లుంటారా?! అందులోకి పల్లీ లేదా కొబ్బరి పచ్చడి కాంబినేషన్‌ ఉంటే ఇక చెప్పాల్సిందేముంది..

Published : 11 Feb 2024 01:08 IST

మినప్పిండి, బియ్యప్పిండిలతో కరకరలాడే దోశలు ఇష్టపడని వాళ్లుంటారా?! అందులోకి పల్లీ లేదా కొబ్బరి పచ్చడి కాంబినేషన్‌ ఉంటే ఇక చెప్పాల్సిందేముంది.. ఇష్టంగా లాగించేస్తాం! ఇంత రుచిగా ఉంటాయి కనుకనే.. దోశలకు వేరే దేశాల్లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇంతకీ ఇప్పుడు దోశల ఊసులెందుకంటే.. ట్రావెల్‌ అండ్‌ ఫుడ్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌’ ప్రపంచంలో బెస్ట్‌ అంటూ 50 దేశాల పాన్‌కేక్స్‌ను పేర్కొంది. వాటిల్లో ‘దోశ’ పదో ర్యాంక్‌ సాధించింది. అంతే కాదండోయ్‌.. స్పైసీ బంగాళదుంప కర్రీతో నోరూరించే ‘మసాలా దోశ’ పన్నెండో స్థానంలో నిలిచింది. వారెవా.. దోశ- దేశాన్ని దాటి ప్రపంచంలో తన సత్తా చాటడం ముచ్చటేస్తోంది కదూ! ఇన్‌స్టాలో పోస్టయిన ఈ వీడియో దోశల ఘుమాయింపును లోకమంతా చాటుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని