మల్టీపర్పస్‌ ఎగ్‌ బాయ్‌లర్‌

వంటలన్నీ చకచకా చేసేవాళ్లు కూడా కోడిగుడ్డు ఉడకబెట్టే విషయంలో కొంచెం చిరాకుపడటం చూస్తుంటాం.

Published : 18 Feb 2024 00:02 IST

వంటలన్నీ చకచకా చేసేవాళ్లు కూడా కోడిగుడ్డు ఉడకబెట్టే విషయంలో కొంచెం చిరాకుపడటం చూస్తుంటాం. మామూలుగా గుడ్లు మునిగేవరకూ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్‌ మీద ఏడెనిమిది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. కానీ పనుల ఒత్తిడిలో దాని సంగతి మర్చిపోతే కష్టమే. సరిగ్గా ఉడకకపోయినా, ఎక్కువ ఉడికి రాయిలా తయారైనా లాభంలేదు. ఈ సమస్యను నివారించే పరికరం ఎగ్‌ బాయ్‌లర్‌ ఆటోమాటిక్‌ ఎలక్ట్రానిక్‌ కుకర్‌. చూసేందుకు ఫ్లాస్క్‌లా ఉంటుంది. ఇందులో గుడ్లు ఉడికించవచ్చు, ఆమ్లెట్‌ వేసుకోవచ్చు. ఎగ్‌రోల్స్‌ లాంటివీ తయారుచేయొచ్చు. ఇందుకు ప్రత్యేకించి ప్యాన్‌ కానీ కడాయి కానీ అవసరం లేదు. నాన్‌ స్టిక్‌ కుకింగ్‌ ఛాంబర్‌ ఉన్న ఈ మల్టీ పర్పస్‌ పరికరాన్ని ఎక్కువ కాలం మన్నేలా రూపొందించారు. దీన్ని శుభ్రపరచడమూ సులువే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని