లక్ష్మణుడి ప్రలోభం

కన్నతల్లిలా ఆదరించే భూమాతపై భక్తిప్రపత్తులు చూపాల్సిన బాధ్యత మనందరిదీ. రామరావణ యుద్ధంలో లంకేశుడు చనిపోయాడు.

Updated : 14 Mar 2023 15:21 IST

కన్నతల్లిలా ఆదరించే భూమాతపై భక్తిప్రపత్తులు చూపాల్సిన బాధ్యత మనందరిదీ. రామరావణ యుద్ధంలో లంకేశుడు చనిపోయాడు. విభీషణుడికి అభయమిచ్చిన మేరకు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమని లక్ష్మణుణ్ణి పురమాయించాడు శ్రీరాముడు. ఆ సిరిసంపదలు చూసిన లక్ష్మణుడికి మనసు చెదిరింది. తిరిగొచ్చి ‘భరతుడు మళ్లీ రాజ్యాన్ని అప్పగిస్తాడో లేదో! ధనధాన్యాలతో తులతూగుతున్న లంకను మనమే ఉంచుకుని, విభీషణుడికి వేరే రాజ్యాన్ని అప్పగిద్దాం’ అన్నాడు. అది విన్న శ్రీరాముడి మనసు చివుక్కుమంది. తక్షణం కుటీరంలోకి వెళ్లి, తను నిత్యం పూజించే అయోధ్యాపురి నుంచి తెచ్చిన మట్టి మూటను తీశాడు. దాన్ని కళ్లకద్దుకుని సోదరుడికి అందించాడు. అంతే.. లక్ష్మణుణ్ణి ఆవరించిన మాయ తొలగిపోయింది. జననీ, జన్మభూమీ రెండూ పవిత్రమైనవీ, సాటిలేనివీ అనే నిజం బోధపడింది. తాను కూడా కళ్లకద్దుకుని రాముడి ముందు తల వంచాడు సౌమిత్రి.

 - శ్రీపద అగ్నిహోత్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని