కంచెలు వేయొద్దు

దేవుణ్ణి ప్రేమిస్తే ఇక అన్నిటినీ ప్రేమించినట్టే. ఎందుకంటే దేవుడిలో మనిషి కూడా ఉన్నాడు. కనుక దైవం మీది ప్రేమ మనిషికీ వర్తిస్తుంది. అలాగే సాటి మనుషులను ప్రేమించడం అనేది దేవుడికీ చెందుతుంది.

Published : 22 Jun 2023 00:21 IST

దేవుణ్ణి ప్రేమిస్తే ఇక అన్నిటినీ ప్రేమించినట్టే. ఎందుకంటే దేవుడిలో మనిషి కూడా ఉన్నాడు. కనుక దైవం మీది ప్రేమ మనిషికీ వర్తిస్తుంది. అలాగే సాటి మనుషులను ప్రేమించడం అనేది దేవుడికీ చెందుతుంది. దైవారాధన ప్రేమించటంగా కనిపిస్తుంది. మనిషి పట్ల సేవాభావం, దయాగుణం, కనికరం రూపంలో కనిపిస్తాయి. బైబిల్‌ పాత నిబంధనలో పది ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలో వాటి సారాన్ని రెండు ఆజ్ఞల్లో  సంక్షిప్తంగా చెప్పాడు- ‘పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనసుతో దేవుడైన ఏసు ప్రభువును ప్రేమించాలి’ (మత్తయి 22:37) ‘నీ వలెనే నీ పొరుగువారిని ప్రేమించు’ (మత్తయి 22:39) మొదటిది దైవ ఆరాధనకు, రెండోది మానవ ప్రేమకు సంకేతం. మనిషిలో దేవుణ్ణి, దేవుడిలో మనిషినీ చూడాలన్నదే భావన. చుట్టూ ఉన్నవారికి కంచెలు వేసి, దూరమవకుండా ప్రేమించాలన్నది సందేశం.
డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని