గౌతముడి తిరస్కరణ

సిద్ధార్థుడు వివిధ ప్రాంతాలు తిరుగుతూ ధర్మబోధలు చేస్తు న్నాడు. ఒకరోజు ఓ పిసినారి వ్యాపారి ఇంటి ముందు నిలబడి ఆహారం అర్థించగా అతడు పరుష పదజాలంతో దూషించాడు.

Published : 13 Jul 2023 01:45 IST

సిద్ధార్థుడు వివిధ ప్రాంతాలు తిరుగుతూ ధర్మబోధలు చేస్తు న్నాడు. ఒకరోజు ఓ పిసినారి వ్యాపారి ఇంటి ముందు నిలబడి ఆహారం అర్థించగా అతడు పరుష పదజాలంతో దూషించాడు. తథాగతుడు చిరునవ్వుతో వెళ్లిపోయాడు. అలా గౌతముడు వెళ్లి నప్పుడల్లా ఆ వ్యాపారి తిట్టి పంపాడు. బుద్ధుడి ముఖంలో ప్రసన్నత చెదరలేదు. కొన్నాళ్లకు వ్యాపారి ఇంట్లో ఆహారం మిగిలిపోయింది. అది వృథా అవుతుందని బౌద్ధ భిక్షువుల కోసం ఎదురుచూస్తున్నాడతడు. ఎప్పటిలాగానే బుద్ధుడు అతని ఇంటి ముందుకు వచ్చాడు. వ్యాపారి మిగిలిన ఆహారాన్ని తీసుకొచ్చి ఇవ్వబోయాడు. సిద్ధార్థుడు సున్నితంగా తిరస్కరించాడు. ‘ఎందుకు తీసుకోవడంలేదు?’ అనడిగాడు వ్యాపారి. ‘నాకు అవసరం లేదు. నేను తీసుకోలేదు కనుక అది నీ దగ్గరే ఉంది. అలానే ఇన్నాళ్లూ నీ తిట్లూ నిందలనూ కూడా నేను స్వీకరించలేదు కనుక అవి నీ దగ్గరే ఉన్నాయి’ అంటూ బదులిచ్చాడు. ఇంతకాలం తానెంత మూర్ఖంగా ప్రవర్తించాడో, కఠిన పదజాలంతో ఎంతమందిని హింసించాడో అర్థమై చింతించాడు వ్యాపారి. ఆ తర్వాతెన్నడూ పిసినారితనం చూపలేదతడు. అడగకుండానే ధనం పంచేవాడు.

గ్యార అనిల్‌, ఒంగోలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని