పరమాత్మ చైతన్య స్వరూపం

ఇద్దరు శిష్యులు పరమానందయ్య పాదాలు ఒత్తుతున్నారు. ఇంతలో ఒక కాలు గురువు రెండో కాలికి తగిలింది. గురువు కాలిని తన్నాడంటూ రెండో శిష్యుడు తన చేతిలో ఉన్న కాలిని రెండో కాలిమీద ఎత్తి పడేశాడు.

Updated : 03 Aug 2023 04:38 IST

ద్దరు శిష్యులు పరమానందయ్య పాదాలు ఒత్తుతున్నారు. ఇంతలో ఒక కాలు గురువు రెండో కాలికి తగిలింది. గురువు కాలిని తన్నాడంటూ రెండో శిష్యుడు తన చేతిలో ఉన్న కాలిని రెండో కాలిమీద ఎత్తి పడేశాడు. పరమానందయ్యకి మెలకువ వచ్చి, ఏమైందని అడిగారు. శిష్యులు విషయం వివరించి.. ఇద్దరికిద్దరూ తన కాలే గొప్పది అన్నారు. గురువుకు కోపం ముంచుకొచ్చినా, తమాయించుకుని.. ‘కాళ్లు-చేతులు, కళ్లు-చెవులు అంటూ వేరువేరుగా కనిపించినా వాటిని చైతన్యపరిచేది పరమాత్మేనని గ్రహిస్తే మీరిలా వాదులాడుకోరు. ఒక కాలు మరో కాలికి తగలడం అనేది ఎంత అల్పవిషయమో తెలుసు కుంటారు. దేహంలోని ఏ అవయవం మరో అవయవంతో కలహించదు, హింసించదు. లోకం భగవత్‌ స్వరూపమైతే మనమంతా అవయవాల వంటి వాళ్లం. అందువల్ల మనం కోపాలూ ద్వేషాలూ మాని సర్వ ప్రాణుల పట్ల ఆదరం, అభిమానం చూపాలి’ అంటూ హితవు పలికారు.

లక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని