చెట్లూ బాధ పడతాయి!

రక్తపు మరకలతో వచ్చిన పదేళ్ల కొడుకును చూసి తల్లి ఆందోళన చెందింది. గొడ్డలి తగిలినట్లు గుర్తించి ‘ఏంటయ్యా.. ఎవరైనా తనకు తానే గాయం చేసుకుంటారా? ఇంత నొప్పి ఎలా భరిస్తున్నావు? ఇదెంత ప్రమాదం!’ అంది బాధగా.

Published : 10 Aug 2023 00:25 IST

క్తపు మరకలతో వచ్చిన పదేళ్ల కొడుకును చూసి తల్లి ఆందోళన చెందింది. గొడ్డలి తగిలినట్లు గుర్తించి ‘ఏంటయ్యా.. ఎవరైనా తనకు తానే గాయం చేసుకుంటారా? ఇంత నొప్పి ఎలా భరిస్తున్నావు? ఇదెంత ప్రమాదం!’ అంది బాధగా.

‘మరి గొడ్డలితో కొడితే చెట్టుకి కూడా నొప్పే కదమ్మా! అదీ బాధ పడుతుందిగా! నువ్వేమో తుమ్మ బెరడు కావాలన్నావు. గొడ్డలితో చెట్టుకి గాట్లు పెట్టి, నీ కోసం బెరడు తెచ్చాను. పాపం, అదెంత బాధపడుతుందో.. ఆ బాధ నాకూ తెలియాలని గాయపరచుకున్నాను’ అన్నాడు. కొడుకు మాటలకు విలపిస్తూ ‘నేను చాలా పొరపాటు చేశాను నాయనా! నీది పెద్ద మనసు. మనలాగే చెట్లు, జంతువులు, క్రిమి కీటకాలకూ ప్రాణం ఉంటుంది. వాటిని హింసిస్తే అవి మనలా చెప్పలేకపోయినా.. మూగ బాధను అనుభవిస్తాయి. ఈ సున్నిత హృదయాన్ని పాషాణం కానీయకు. ఇదే నా ఆశీస్సు’ అని అక్కున చేర్చుకుంది. ఆ మాతృమూర్తి ఆశీస్సులతో మహానుభావుడిగా ఎదిగిన ఆధ్యాత్మిక గురువే గురునానక్‌.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని