అనుకరించొద్దు.. అన్వేషించాలి

‘మనసు, బుద్ధి, ఆత్మ, హృదయం అనే పదాలను వేదాంతులు, తాత్వికులు, మనోవిశ్లేషకులు ఎక్కువగా ఉదహరిస్తుంటారు. ప్రతి శబ్దానికీ అర్థం, భావం ఉంటాయి.

Published : 17 Aug 2023 00:06 IST

‘మనసు, బుద్ధి, ఆత్మ, హృదయం అనే పదాలను వేదాంతులు, తాత్వికులు, మనోవిశ్లేషకులు ఎక్కువగా ఉదహరిస్తుంటారు. ప్రతి శబ్దానికీ అర్థం, భావం ఉంటాయి. తెలిసిన అర్థం పరీక్షలో ఉత్తీర్ణత ఇస్తే.. భావం జీవితంలో ఉన్నతి సాధించేందుకు దోహదం చేస్తుంది. అంటే అర్థం కంటే భావమే ప్రధానం. ఆయా శబ్దాలకు ఇంతకు పూర్వమే ఒక స్థిరభావం ఉంటుంది. మనం ఆ భావాన్నే అనుకరిస్తాం కానీ అదేమిటో పరిశీలించేందుకు  ప్రయత్నించం. కొన్నిసార్లు అర్థం తెలిసినా.. ప్రయోగించిన తర్వాత సందేహం, సంఘర్షణ కలుగుతాయి. అంటే మనం సంపాదించిన జ్ఞానం అసంపూర్ణమేనని అలాంటి సమయాల్లో స్పష్టమవుతుంది. డొంకతిరుగుడు లేకుండా నిజాయతీగా వ్యవహరించినట్లయితే వైరుధ్యాలు ఏర్పడవు. అది నైతికతనూ పెంచుతుంది. దేహం, భౌతిక విషయాలు అనేవి పరిమితమైన అంశాలు. ఆత్మ, దేవుడు, బ్రహ్మ అనేవి అపరిమితాలు. ఈ శబ్దాల్లో పైకి కనిపించే అర్థం కంటే వెనుక దాగి ఉన్న భావం ప్రధానమని గ్రహించాలి. అలాగే.. ఒకరు చెప్పినంతలో అనుకరించొద్దు, అన్వేషించి అసలైన భావాన్ని గ్రహించాలి’ ఒక ఫ్రెంచ్‌ వనితతో సంభాషిస్తూ జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన మాటలివి.

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని