అవధుల్లేని ఆనందం

పరిష్వంగం అంటే కౌగిలింత. అది ఆత్మీయతను వ్యక్తం చేసుకునే సూచిక. అందులోని మధురిమ ఒక తీపిగుర్తుగా మిగిలిపోతుంది. ఆప్తులైనవారు.. ఎడబాటు తర్వాత కలిసినప్పుడు చేసుకునే పరిష్వంగం వర్ణించనలవికానిది. ఆ కౌగిలింతలో తమ మధ్య అనురాగం మినహా దేనికీ చోటు లేదన్నట్లు ఉంటుంది. పరిష్వంగం ఆత్మీయతను తెలియజేయడమే కాదు.. ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ ఇస్తుంది.

Published : 23 Nov 2023 00:07 IST

రిష్వంగం అంటే కౌగిలింత. అది ఆత్మీయతను వ్యక్తం చేసుకునే సూచిక. అందులోని మధురిమ ఒక తీపిగుర్తుగా మిగిలిపోతుంది. ఆప్తులైనవారు.. ఎడబాటు తర్వాత కలిసినప్పుడు చేసుకునే పరిష్వంగం వర్ణించనలవికానిది. ఆ కౌగిలింతలో తమ మధ్య అనురాగం మినహా దేనికీ చోటు లేదన్నట్లు ఉంటుంది. పరిష్వంగం ఆత్మీయతను తెలియజేయడమే కాదు.. ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ ఇస్తుంది. పెద్దలు లేదా గురువు స్థాయిలో ఉన్న వ్యక్తి- ప్రత్యేక సందర్భంలో దగ్గరకు తీసుకుంటే.. అది జీవితంలో మర్చిపోలేని మధురమైన అనుభూతిగా నిలుస్తుంది. మనకు నచ్చిన, మనం మెచ్చిన వ్యక్తిని ఆలింగనం చేసుకుని ఆత్మీయతను చాటుతాం. ఆ కౌగిలింతలో తెలియని తియ్యదనం, దగ్గరితనం కనిపిస్తాయి. అందులో సాంత్వన, ఓదార్పు ఉంటాయి. రామాయణంలో హనుమ.. సీత జాడ తెలుసుకుని, ఆమె నుంచి చూడామణి గుర్తుగా తీసుకుని.. శ్రీరాముడి వద్దకు వచ్చాడు. అప్పుడు హనుమతో రామచంద్రుడు- ‘నువ్వు చేసిన ఈ సాయానికి నేనేం ఇవ్వగలను?!’ అంటూ గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. రాముని కౌగిలింతతో ఆ పరమ భక్తుడి ఆనందానికి అవధులు లేకపోయాయి. హనుమకు తన ప్రభువు పరిష్వంగం కంటే కావలసింది ఏముంది?!

యం.వి.రామారావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని