కాశీకి వెళ్లినప్పుడు మనకు ఇష్టమైన వాటిని వదిలివేయడానికి కారణమేమిటి?
ఈ శరీరాలు, ఇంద్రియాలు, అవయవాలు, బుద్ధి, మనసు... ఇలా అన్నీ పరమాత్మ ఇచ్చినవే. ఆయన ఇచ్చిన వానితో ఆయన సేవే చేయాలి. నాలుకతో నామకీర్తన చేయాలి. మనసుతో ...
ఈ శరీరాలు, ఇంద్రియాలు, అవయవాలు, బుద్ధి, మనసు... ఇలా అన్నీ పరమాత్మ ఇచ్చినవే. ఆయన ఇచ్చిన వానితో ఆయన సేవే చేయాలి. నాలుకతో నామకీర్తన చేయాలి. మనసుతో ధ్యానం, చేతులతో పూజ చేయాలి. చెవులతో ఆయన కథలనే వినాలి. కన్నులు ఆ స్వామిని, స్వామి భక్తులనే చూడాలి. కాళ్లు దేవాలయాలకు, భక్తుల ఇళ్లకు వెళ్లాలి. నాసిక స్వామి పాదాలపై ఉంచిన తులసిని వాసన చూడాలి. ప్రతి నాలుగు మాటలలో ఒక మాట భగవానునిది కావాలి. ఇలా చేస్తే సంసారంలో ఉన్నా సన్యాసంలో ఉన్నా ఒకటే! కానీ కన్ను, ముక్కు, చెవులు, నాలుకకు ప్రకృతిలో లభించేవే ఇష్టం. మన ఇష్టాల కోసం భగవంతుని వదులుకుంటున్నాం. ఇలా చేస్తే మన ఇష్టాలన్నీ కష్టాలనే కలిగిస్తాయి. బాగా తింటే అజీర్ణం, బాగా అనుభవిస్తే అంటువ్యాధులు.. ఇలా కలుగుతాయి. భగవంతుని వదిలి ఇష్టాలను పట్టుకుని కష్టాల పాలుకాకుండా భగవంతుని కోసం మన శరీరానికిష్టమయ్యే వాటిని వదిలితే మనసు, బుద్ధి, శరీరం ప్రసన్నంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఒక్కసారే అన్నీ వదలటం కష్టం కాబట్టి ఒక్కొక్క క్షేత్రంలో ఇష్టాన్ని విడుస్తూపోతే కోరికలు తగ్గుతాయి. ఇష్టం కోసం భగవంతుని విడిస్తే సంసారం.. భగవంతుడి కోసం ఇష్టాన్ని విడిస్తే ప్రసన్నత, సంతృప్తి, సంతోషం, లభిస్తాయి! అందుకే కాశీలో కొన్ని, గయలో కొన్ని, ప్రయాగలో కొన్ని, గంగలో కొన్ని ఇలా విడుచుకుంటూపోతే చివరికి ఆశ లేకుండా పోతుంది. ఇదీ ఇందులోని అంతరార్థం. కోరికలకు దాసుడివి కాకు! కోరికలను దాసులను చేసుకో! ఇవీ బోధ!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!