శివలింగం ఇంటిలో ఉండవచ్చా?

శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోకూడదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలంకరణ కోసం, సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు, నైవేద్యాలు చేయనక్కర్లేదు. అయితే ఒక్కసారి...

Updated : 07 Feb 2019 18:48 IST

శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోకూడదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలంకరణ కోసం, సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు, నైవేద్యాలు చేయనక్కర్లేదు. అయితే ఒక్కసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదు. భగవంతుని శక్తిని ఆవాహన చేసి పూజించిన తరువాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుంది. అందులోనూ ప్రత్యేకించి శివలింగం గురించి చెప్పాలంటే ‘లీనమర్థం గమయతీతి లింగః’ అని అంటారు. అంటే సృష్టంతా వ్యాపించి ఉన్న శక్తులను, వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టేది లింగం. అంతటి శక్తివంతమైన లింగానికి నిత్యపూజ చేయడం కనీస ధర్మం. నర్మదా బాణలింగాల వంటివీ ఇంటిలో ఉంచుకోవచ్చు. నిత్యపూజకు లోపం రానీయకూడదు. శ్రద్ధగా శివపూజ చేయగలిగిన వారు ఇంటిలో శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని