వధూవరులకు అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు

వివాహం జరిగిన అనంతరం వధూవరులను ఇంటి బయట (వివాహ వేదికకు) తూర్పునకుగానీ, ఉత్తరానికి గానీ తీసుకొని వెళ్లి మొదట ధ్రువ నక్షత్రాన్ని, తరువాత అరుంధతీ నక్షత్రాన్ని వారికి చూపిస్తారు. ధ్రువ నక్షత్రంలా దంపతులిద్దరు నిలకడ మనస్తత్వాలతో స్థిరంగా ఉండాలని, అలాగే...

Updated : 12 Mar 2023 13:40 IST

వివాహం జరిగిన అనంతరం వధూవరులను ఇంటి బయట (వివాహ వేదికకు) తూర్పునకుగానీ, ఉత్తరానికి గానీ తీసుకొని వెళ్లి మొదట ధ్రువ నక్షత్రాన్ని, తరువాత అరుంధతీ నక్షత్రాన్ని వారికి చూపిస్తారు. ధ్రువ నక్షత్రంలా దంపతులిద్దరు నిలకడ మనస్తత్వాలతో స్థిరంగా ఉండాలని, అలాగే వధువు అరుంధతిలాగా మహాపతివ్రతలా మనుగడ సాగించాలనే ఆకాంక్ష ఈ ప్రక్రియలో కనిపిస్తుంది. 

ధ్రువ నక్షత్ర దర్శనం చేసే సమయంలో ఈ మంత్రం చెప్పాలి.

ధ్రువ క్షితిః ధ్రువ యోనిః ధ్రువమపి
ధ్రువతః స్థిరం త్వం నక్షత్రాణాం
మేధ్యసి సమాపాహి పృతన్యతః

ఈ భూమికి కేంద్రం ధ్రువము, ఈ ఉత్పత్తి స్థానం ధ్రువము, నీవు ధ్రువము, ధ్రువముగా ఉందువు, నక్షత్రముల సమూహమున ధ్రువత్వము పొంది వర్థిల్లాలి అని అర్థం.

అరుంధతీ నక్షత్ర దర్శనం చేసే సమయంలో ఈ మంత్రం జపించాలి.

సప్తర్షయః ప్రథమా కృత్తికా
నాం అరుంధతీం యత్‌ ధ్రువతాం
హనిన్యుః షట్కృత్తికా ముఖ్య
యోగ మహంతీ యం అస్మాకం ఏత త్వష్టమీ.

సప్తరుషులు కృత్తికలలో మొదటగా ఈమెను పిలవడం వలన మిగిలిన ఆరు కృత్తికలకు ముఖ్యమైన కలయికను ఈమె నడిపిస్తుంది. మాకు ఈమె ఎనిమిదవది అని అర్థం.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని