Viral: నవ్వులు పూయిస్తున్న బైక్ దొంగతనం
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఓ వ్యక్తి చేసిన బైక్ దొంగతనం అందరిచేత నవ్వులు పూయిస్తోంది.
కలబురగి: కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఓ వ్యక్తి చేసిన బైక్ దొంగతనం అందరిచేత నవ్వులు పూయిస్తోంది. అఫ్జల్పురలోని ఆగ్రో రోడ్లో పార్క్ చేసి ఉన్న ఓ ద్విచక్రవాహనాన్ని దొంగతనం చేశాడో వ్యక్తి. సరిగ్గా అర్ధరాత్రి బండి దగ్గరకు వెళ్లి.. చుట్టుపక్కల ఎవరైనా లేస్తారేమోనని భావించి, బైక్‌ను స్టార్ట్ చేయకుండా తోసుకుంటూ తీసుకెళ్లాడు. తీరా కొంతదూరం వెళ్లాక కొట్టేసిన బండి స్టార్ట్ కాలేదు. దీంతో అక్కడే వదిలేసి వెళ్లలేక.. దొంగతనం చేసిన చోటుకే తిరిగి భద్రంగా తెచ్చిపెట్టాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వీడియో చూసినవారు తెగ నవ్వుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్‌లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్‌తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?