Watch: లారీని ఢీకొట్టిన ఖడ్గమృగం.. వీడియో షేర్‌ చేసిన సీఎం

10 సెకెన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో ఖడ్గమృగం అటవీ ప్రాంతం నుండి పరుగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపైకి జారిపడి ట్రక్కును ఢీకొట్టినట్టు రికార్డయింది. ఢీకొట్టిన తర్వాత ఆ వన్యప్రాణి లేచి కాసేపు పరుగెత్తి మళ్లీ కింద పడి తిరిగి అడవిలోకి పారిపోయింది.

Published : 09 Oct 2022 17:50 IST

గువాహటి: అస్సాంలోని హల్దిబారిలో ఇటీవల ఖడ్గమృగం ఓ వాహనాన్ని ఢీకొట్టిన వీడియోను అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ట్విటర్‌లో చేశారు. దీన్ని దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్న ఆయన.. ఆ వన్యప్రాణి ప్రాణాలతో బయటపడిందని పేర్కొన్నారు. ఖడ్గమృగాలు మనుషులకు మంచి మిత్రులని.. వాటికి హాని కలిగించే చర్యల్ని సహించబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆ వాహన డ్రైవర్‌కు జరిమానా విధించినట్టు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అసోంలోని కజిరంగ నేషనల్‌ పార్కు వద్ద 33కి.మీల మేర ప్రత్యేక ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటుపై పనిచేస్తున్నామని సీఎం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

సీఎం షేర్‌ చేసిన 10 సెకెన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో ఖడ్గమృగం అటవీ ప్రాంతం నుండి పరుగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపైకి జారిపడి ట్రక్కును ఢీకొట్టినట్టు రికార్డయింది. ఢీకొట్టిన తర్వాత ఆ వన్యప్రాణి లేచి కాసేపు పరుగెత్తి మళ్లీ కింద పడి తిరిగి అడవిలోకి పారిపోయింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఈ ఘటనలో డ్రైవర్‌ తప్పేమీ లేదని.. ఇదో దురదృష్టకర సంఘటన అని కొందరు వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు సూచిస్తూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని