Viral Video: వంటలక్కా మజాకానా.. కుకింగ్ షోలో ఈ మహిళ చేసిన పనికి అవాక్కవాల్సిందే!
ఇస్లామాబాద్: ఇటీవలి కాలంలో టీవీ షో (TV Shows)లకు వస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. డ్యాన్స్ షో (Dance Show), కుకింగ్ షో (Cooking Show) అంటూ విభిన్న కాన్సెప్టులతో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు షోలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల కోసం నిర్వహించే కుకింగ్ షోలు ప్రపంవ్యాప్తంగా అన్ని దేశాల్లో పాపులర్ అయ్యాయి. వీటిలో మహిళలు తమ వంటలతో జడ్జీలను మెప్పించాలి. ఈ క్రమంలో పాకిస్థాన్ (Pakistan) టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే కుకింగ్ షోలో ఓ మహిళ చేసిన పని జడ్జీలకు కోపం తెప్పిస్తే.. షో చూసేవారికి మాత్రం నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
పాకిస్థాన్‌లో ఓ టీవీ ఛానెల్ ది కిచెన్ మాస్టర్ (The Kitchen Master) అనే కుకింగ్ షోను నిర్వహిస్తోంది. ఈ షో ఆడిషన్స్ కోసం వచ్చే మహిళలు తాము చేసిన ఏదైనా వంటకాన్ని జడ్జీలు రుచి చూపించాలి. దాని ఆధారంగా వారిని షోకు ఎంపిక చేస్తారు. అలానే వంటకాన్ని అందంగా ప్లేట్లలో సర్థడం, ఆర్ట్‌ఫుల్‌గా చూపించడం కూడా చేయాలి. ఈ క్రమంలో ఓ మహిళ చేతిలో ప్లాస్టిక్ బాక్స్‌తో జడ్జీల ముందుకు వచ్చింది. అది చూసిన జడ్జీలు అందులో ఏముందని సదరు మహిళను ప్రశ్నించగా బిర్యానీ (Biryani) అని సమాధానం చెప్పింది. బాక్స్‌లో ఎందుకు తీసుకొచ్చావని సదరు మహిళను జడ్జీలు ప్రశ్నించగా.. రెస్టరంట్ వాళ్లు అలానే ప్యాక్ చేసి ఇచ్చారని చెప్పడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
అదేంటీ..నువ్వు వండి తీసుకురావాలి కదా అని ప్రశ్నిస్తే.. ఈ బిర్యానీ తమ ప్రాంతంలో ఎంతో పాపులర్ అని, తాను వండిన బిర్యానీనే తీసుకురావాలని ఎక్కడా ఖచ్చితంగా చెప్పలేదంటూ సదరు మహిళ చెప్పిన సమాధానంతో జడ్జీలు కంగుతిన్నారు. వెంటనే ఆ బిర్యానీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమెకు చెప్పారు. ఈ బిర్యానీ మీకోసం కష్టపడి తీసుకొచ్చానని.. మీరు రుచి చూడాల్సిందేనని పట్టుబట్టడంతో ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షో జడ్జీల్లో ఒకరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ వీడియోను నందితా అయ్యర్ (Nandita Iyer) అనే కాలమిస్ట్ ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ‘ ఆమె కావాలనే అలా చేసింది’, ‘ఇదో ప్రమోషనల్ స్టంట్’,‘ఇదే అసలైన ఎంటర్‌టైన్‌మెంట్’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MIW vs RCBW: విజృంభించిన ముంబయి బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆర్సీబీ
-
India News
Amritpal Singh: టోల్‌ప్లాజా వద్ద కారులో అమృత్‌పాల్ సింగ్..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virender Sehwag : అప్పుడు దాన్ని తప్పనిసరి చేసిఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిలై ఉండేవాళ్లు : సెహ్వాగ్
-
Crime News
TSPSC: రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం