వాస్తవాలేంటో తెలియాలి...

నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఆఫీస్‌లో నా ఫ్రెండ్‌ ప్రవర్తనలో కొంత కాలంగా తీవ్రమైన మార్పులు చూస్తున్నా. వాస్తవానికి తనో మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. కానీ, తను మాత్రం ‘నాకంటే గొప్పవారు లేరు..

Published : 02 Nov 2019 00:46 IST

మనలో మనం

నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఆఫీస్‌లో నా ఫ్రెండ్‌ ప్రవర్తనలో కొంత కాలంగా తీవ్రమైన మార్పులు చూస్తున్నా. వాస్తవానికి తనో మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. కానీ, తను మాత్రం ‘నాకంటే గొప్పవారు లేరు.. నాకే అన్నీ తెలుసు!’ అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎదుటి వారిని చులకనగా చూస్తుంది. మాతో కలిసున్నప్పుడు, తింటున్నప్పుడు తన ప్రవర్తన కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. వాస్తవం వేరు, తన తీరు వేరుగా ఉంది. అసలు ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోంది. ఇలాగే కొనసాగితే తన పరిస్థితి ఏంటి? నా బెస్టీని నేనెలా మార్చుకోగలను?

- రాధ

సమాధానం: మీ ఫ్రెండు గురించి శ్రద్ధ తీసుకోవడం అభినందనీయం. అలాగే మీరు అడిగిన ప్రశ్న చూస్తే మీరు, మీ ఫ్రెండ్స్‌.. తన వల్ల పడుతున్న ఇబ్బంది అర్థమైంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి తను సుపీరియారిటీ కాంప్లెక్స్‌ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లక్షణాలున్న వారు రియాలిటికీ దూరంగా బతుకుతారు. తామే గొప్ప అనిపించుకోవడానికి ఎదుటివారిని సులభంగా హర్ట్‌ చేస్తారు. అయితే, అది వారి ఉద్దేశం కాకపోయినా.. క్రమంగా అలవాటుగా మారటం వల్ల ఇలాంటి ప్రవర్తన వారి వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. వీరికి కౌన్సిలింగ్‌ తప్పక అవసరం. భ్రమ నుంచి వాస్తవాలను క్రమంగా వారికి తెలియజేయాలి. తనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఉండకూడదు. దూషించకూడదు. ‘నేను’, ‘నా తర్వాతే’ అనే భావన మానసికంగా ఒంటరిని చేస్తుందని తెలియజేయాలి. ‘మనం’ అనే భావన సుపీరియారిటీ కాంప్లెక్స్‌ని తగ్గించడమే కాదు. మానసిక ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. నిజజీవితంతో సూపర్‌ స్టార్‌లను చేస్తుందని మీ ఫ్రెండ్‌కి చెప్పండి. కొద్ది రోజుల్లోనే మీరు కోరుకుంటున్న మార్పు తనలో వస్తుంది. ఒకవేళ మీ మాటలతో ప్రభావం చూపకుంటే సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన వైద్యాన్ని అందిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని