కోహ్లిలా.. గర్వపడదామా?

‘ఏ ప్రౌడ్‌ హజ్బెండ్‌ అండ్‌ ఫాదర్‌’ క్రికెట్‌ వీరుడు విరాట్‌ కోహ్లి ట్విటర్‌లో తాజాగా దర్శనమిచ్చిన బయో. ఓ అమ్మాయికి భర్తగా, కూతురికి తండ్రిగా తాను గర్వంగా ఫీలవుతున్నానని చెబుతున్నాడు కోహ్లి. అతడి సంగతి అలా ఉంచితే మంచి భర్తగా, తండ్రిగా గర్వపడేలా ఉండాలంటే మన కుర్రాళ్లు ఏం చేయాలంటే..

Published : 23 Jan 2021 01:29 IST

‘ఏ ప్రౌడ్‌ హజ్బెండ్‌ అండ్‌ ఫాదర్‌’ క్రికెట్‌ వీరుడు విరాట్‌ కోహ్లి ట్విటర్‌లో తాజాగా దర్శనమిచ్చిన బయో. ఓ అమ్మాయికి భర్తగా, కూతురికి తండ్రిగా తాను గర్వంగా ఫీలవుతున్నానని చెబుతున్నాడు కోహ్లి. అతడి సంగతి అలా ఉంచితే మంచి భర్తగా, తండ్రిగా గర్వపడేలా ఉండాలంటే మన కుర్రాళ్లు ఏం చేయాలంటే..
సమకూర్చాలి: కొండమీద కోతిని తెచ్చివ్వకపోయినా భాగస్వామి కనీస అవసరాలు అడగకముందే తీర్చగలగాలి. కంటికి రెప్పలా కాపాడుకుంటూ అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తే.. మంచి భర్తగా గర్వపడొచ్చు.
ఆ సమయంలో: మాతృత్వం అమ్మాయికి మర్చిపోలేని జ్ఞాపకం. ఈ సమయంలో తను ఎలాంటి భావోద్వేగానికి గురి కాకుండా చూసుకోవాలి. సరైన వైద్యం అందించాలి.
పక్కనే: తను తల్లి అయ్యే సమయంలో భర్త పక్కన ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఆ మధుర క్షణాలను తనతో కలిసి ఆస్వాదిస్తే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం.
సమంగా: మంచి భర్త, మంచి తండ్రిగా ఉండటం అంటే మంచి భాగస్వామి అవడం. కుర్రాళ్లు భార్యతో, పిల్లలతో స్నేహితుడిలా, భాగస్వామిలా ఉండాలి. ఇంటి పనుల్లో సాయం చేయాలి.
నేర్పించాలి: ముప్ఫైకి అటూఇటుగా తండ్రవుతాం. బాధ్యతలు తలకెత్తుకోవాల్సిందే. పిల్లలకు ఇతరుల్ని ప్రేమించడం, బాధ్యతగా ఉండటం, అవసరాల్లో ఉన్నవారికి సాయపడటం నేర్పించాలి. అవన్నీ పాటిస్తూ రోల్‌మోడల్‌లా ఉండాలి.
సమయం: ఎంత తీరిక లేకుండా ఉన్నా భాగస్వామితో నాణ్యమైన సమయం గడపాలి. అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి వెళ్లడం ఎంత ముఖ్యమో మంచి సమయం ఇవ్వడమూ అంతే ముఖ్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని