‘రంగ్‌’వీర్‌ సింగ్‌

ఫ్యాషన్‌లో ఎప్పుడూ తన ముద్ర వేసే రణ్‌వీర్‌ సింగ్‌ను ఫాలో అయ్యేవారికి ఇప్పటికే ఈ విషయం అర్థమై ఉంటుంది. దీపికతో   పెళ్లయ్యాక మరింత జోరుపెంచిన రణ్‌వీర్‌ సింగ్‌ ఫ్యాషన్లతో అదరగొడుతున్నాడు. విపరీతమైన ముదురు రంగులు, చిత్రవిచిత్రమైన స్టిక్కర్లతో షర్ట్స్‌, టీషర్ట్స్‌ వేసి ఫొటోలకు ఫోజులిస్తున్నాడు....

Published : 16 Feb 2019 00:34 IST

గల్లీబాయ్‌ స్టైల్‌ 

లేత రంగు చొక్కాలు... అఫీషియల్‌ 
ముదురు రంగు టీషర్ట్స్‌... క్యాజువల్‌ 
చిన్న గళ్లగళ్ల చొక్కాలు ఫార్మల్‌ 
మరి రంగురంగులు, పెద్దపెద్ద గళ్ల చొక్కాలు, ప్యాంట్లు... ట్రెండ్‌.

ఫ్యాషన్‌లో ఎప్పుడూ తన ముద్ర వేసే రణ్‌వీర్‌ సింగ్‌ను ఫాలో అయ్యేవారికి ఇప్పటికే ఈ విషయం అర్థమై ఉంటుంది. దీపికతో   పెళ్లయ్యాక మరింత జోరుపెంచిన రణ్‌వీర్‌ సింగ్‌ ఫ్యాషన్లతో అదరగొడుతున్నాడు. విపరీతమైన ముదురు రంగులు, చిత్రవిచిత్రమైన స్టిక్కర్లతో షర్ట్స్‌, టీషర్ట్స్‌ వేసి ఫొటోలకు ఫోజులిస్తున్నాడు. పెద్దపెద్ద ముదురు రంగు గళ్ల చొక్కాలతో యువతను కట్టిపడేస్తున్నాడు. వీటికి తగ్గట్లే ప్యాంట్లూ... రంగురంగులతో మెరిసిపోతున్నాయి. గతంలో ఒకే రంగు ప్యాంట్లకే ప్రాధాన్యం ఇచ్చే వారు సైతం అభిప్రాయం మార్చుకుంటున్నారు. అయిదేళ్ల క్రితం ఇలాంటి ముదురు రంగులను వాడటానికి జంకేవారు. ఎబ్బెట్టుగా ఉంటాయని వెనుకడుగు వేసేవారు. ఇప్పుడు యువత మొత్తం ఇలా మల్టీకలర్డ్‌ దుస్తులపైనే మోజు పడుతోంది. నైట్‌ పార్టీలు, క్యాజువల్‌ లుక్‌ కోసం ఎగబడుతోంది. అందరికంటే భిన్నంగా కన్పించాలనుకునే వారు ఈ దుస్తులపై ఆసక్తి పెంచుకుంటున్నారు.  ఆఫీసులకు, ఫార్మల్‌ మీటింగ్‌లకు వెళ్లే యువత మాత్రం ఈ ట్రెండ్‌కు దూరంగా ఉంటే మంచిదని ఫ్యాషన్‌ నిపుణులు చెబుతున్నారు. ఫ్రెండ్స్‌తో పార్టీలకు, గర్ల్‌ ఫ్రెండ్స్‌తో డేట్‌లకు, విహార యాత్రల్లో ఈ దుస్తులు మిమ్మల్ని కొత్తగా చూపించి ప్రత్యేకతను చాటుతాయంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని