కొత్త పింఛన్లు లేవు... ఉన్నపేర్లూ గల్లంతు

ఎయిడ్స్‌ బాధితులకు కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. ఇటీవల వరకూ పొందినా కొందరి పేర్లు తాజా జాబితాల్లో ఉండటం లేదు. కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి ప్రభుత్వం నుంచి

Published : 27 Jun 2022 04:29 IST

ఎయిడ్స్‌ బాధితుల ఆవేదన

ఈనాడు, అమరావతి: ఎయిడ్స్‌ బాధితులకు కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. ఇటీవల వరకూ పొందినా కొందరి పేర్లు తాజా జాబితాల్లో ఉండటం లేదు. కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక సాయం అందుతున్నా..ఈ పింఛన్ను నిలిపేస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో గత ఆరు నెలలుగా ఏక పెన్షన్‌ విధానం పేరుతో, విద్యుత్తు వాడకం, సొంత ఇల్లు (పట్టణ పరిధిలో 1000 చదరపు అడుగులు దాటితే), ఇతర నిబంధనల అమలుతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎ.ఆర్‌.టి. కేంద్రాల్లో చికిత్స పొందుతూ మందులు తీసుకుంటున్న వారు సుమారు 2 లక్షల మంది ఉన్నారు. 6నెలలపాటు మందులు వాడిన వారికి ఈ పింఛన్‌ ఇవ్వాలి. అయితే ‘ఇతర పథకాల కింద పింఛన్లు పొందే వారిలా ఎయిడ్స్‌ బాధితులు గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసే పరిస్థితి లేదు. ఎక్కడికైనా వెళితే...హెచ్‌ఐవీ సోకిన విషయం అందరికీ తెలుస్తుందన్న ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నారు. దరఖాస్తు చేసిన వారు  కొత్త పింఛన్ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెబుతున్నారే తప్ప ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలుగు నెట్‌వర్క్‌ ఆఫ్‌ పీపుల్‌ లివింగ్‌ విత్‌ హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ అధ్యక్షుడు రామ్మోహనరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని