పారదర్శకంగా రాజధాని భూముల అమ్మకం

రాజధాని అమరావతిలోని 14 ఎకరాల భూముల్ని, నవులూరులోని అమరావతి టౌన్‌షిప్‌లోని స్థలాలను, అప్పట్లో వీజీటీఎం-ఉడా విజయవాడ, తెనాలి వంటి చోట్ల అభివృద్ధి చేసిన టౌన్‌షిప్‌ల్లోని ఖాళీ స్థలాలను పారదర్శకంగా విక్రయించనున్నట్టు

Published : 28 Jun 2022 05:33 IST

ఆ డబ్బును ఎస్క్రో ఖాతాలో వేస్తాం 

అమరావతి అభివృద్ధికే ఖర్చు పెడతాం: సీఆర్‌డీఏ

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలోని 14 ఎకరాల భూముల్ని, నవులూరులోని అమరావతి టౌన్‌షిప్‌లోని స్థలాలను, అప్పట్లో వీజీటీఎం-ఉడా విజయవాడ, తెనాలి వంటి చోట్ల అభివృద్ధి చేసిన టౌన్‌షిప్‌ల్లోని ఖాళీ స్థలాలను పారదర్శకంగా విక్రయించనున్నట్టు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పేర్కొంది. ‘రాజధాని భూముల అమ్మకం’ శీర్షికన ‘ఈనాడు’లో ఆదివారం ప్రచురితమైన కథనంపై సీఆర్‌డీఏ వివరణ ఇచ్చింది. ‘తన పరిధిలోని భూముల్ని వేలం వేసేందుకు సీఆర్‌డీఏ ప్రతిపాదిస్తే... దానికి అనుమతిస్తూ జూన్‌ 6న 389, 390 జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. రాజధానిలో గతంలో ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కి కేటాయించిన భూమిలో 10 ఎకరాలు, బీఆర్‌ శెట్టి మెడిసిటీ కోసం కేటాయించిన భూమిలో నాలుగు ఎకరాలు విక్రయించేందుకు అనుమతిచ్చింది. విజయవాడలోని పాయకాపురం, తెనాలిలోని చెంచుపేట, రాజధానిలోని నవులూరు, ఇబ్రహీంపట్నంలోని ట్రక్‌ టెర్మినల్‌ వంటి చోట్ల గతంలో వీజీటీఎం-ఉడా వేసిన టౌన్‌షిప్‌ల్లోని స్థలాల్ని విక్రయించేందుకూ ప్రభుత్వం సమ్మతించింది. నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లోని 331 ఖాళీ స్థలాలను కూడా ఈ-ఆక్షన్‌ ద్వారా విక్రయిస్తున్నాం. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుని ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమచేసి, దాన్ని రాజధాని నగర అభివృద్ధి కోసం వెచ్చిస్తాం’ అని సీఆర్‌డీఏ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని