నేడు పీఎస్‌ఎల్‌వీ కౌంట్‌డౌన్‌ ప్రారంభం

తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి శనివారం చేపట్టనున్న పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 ప్రయోగానికి చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు.

Published : 25 Nov 2022 04:50 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి శనివారం చేపట్టనున్న పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 ప్రయోగానికి చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి గురువారం షార్‌లో రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశాలు జరిగాయి. అన్ని అంశాలను చర్చించిన పిదప ప్రయోగానికి ముందు 25.30 గంటల కౌంట్‌డౌన్‌ నిర్వహించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 10.56 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే భూటాన్‌ ఉపగ్రహ ప్రయోగం ఉండటంతో ఆ దేశానికి చెందిన శాస్త్రవేత్తల బృందం శనివారం షార్‌కు చేరుకోనుంది. షార్‌ నుంచి శనివారం ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ--సి54 వాహకనౌక ద్వారా బెంగళూరు స్టార్టప్‌నకు చెందిన హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ఆనంద్‌ అని నామకరణం చేశారు. ఈ ఉపగ్రహం బరువు 15 కిలోలు. ఇది వాయువులు, మీథేన్‌ లీకులు, భూగర్భ చమురు,  పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు దోహదపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని