నేడు రైతుల ఖాతాల్లో రూ.200 కోట్ల జమ

రాష్ట్రంలోని రైతన్నలకు పెట్టుబడి రాయితీ, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్ములను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వారి ఖాతాల్లో జమచేయనున్నారు.

Published : 28 Nov 2022 03:15 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని రైతన్నలకు పెట్టుబడి రాయితీ, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్ములను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వారి ఖాతాల్లో జమచేయనున్నారు. గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని వారికీ లబ్ది అందించనున్నారని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం  నుంచి  సీఎం జగన్‌ బటన్‌ నొక్కి మొత్తం రూ.200 కోట్లను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని