రూ.2.5 కోట్ల విలువైన ఆస్తి వితరణ

ఏలూరు జిల్లా దెందులూరు మండల కేంద్రానికి చెందిన మొటపర్తి రామచంద్రమ్మ, వారి కుటుంబ సభ్యులు సుమారు రూ. 2.50 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వానికి వితరణగా అందించారు.

Published : 29 Jan 2023 04:22 IST

దెందులూరు, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా దెందులూరు మండల కేంద్రానికి చెందిన మొటపర్తి రామచంద్రమ్మ, వారి కుటుంబ సభ్యులు సుమారు రూ. 2.50 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వానికి వితరణగా అందించారు. ఇప్పటికే కోట్ల రూపాయల విలువ చేసే గ్రామంలోని ఆస్తులు, భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చారు. ప్రస్తుతం వారు చాలాకాలం నుంచి నివాసమున్న రెండు అంతస్తుల భవనాన్ని ఐసీడీఎస్‌కు అందించారు. భవనంలోని ఫర్నిచర్‌, ఇతర సామగ్రి వదిలేశారు. అలాగే వ్యాన్‌ను అందజేశారు. శనివారం దెందులూరు గ్రామానికి వచ్చిన కలెక్టరు ప్రసన్న వెంకటేశ్‌కు రామచంద్రమ్మ, ఆమె కుమారుడు కాశీ వెంకటేశ్వరరావు (వెంకట్‌), కుమార్తె చలసాని సుధారాణి ఆస్తి పత్రాలను అందించారు. రామచంద్రమ్మతోపాటు కుటుంబ సభ్యులను కలెక్టర్‌ సత్కరించారు. స్థానిక బాల సదన్‌ పిల్లలకు స్కూలు బ్యాగులను పంపిణీ చేశారు. రెండంతస్తుల భవనం మొత్తాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాతలు ఇచ్చిన భవనంలో అనాథలకు ఆశ్రయమిచ్చి.. వారు చక్కగా చదువుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామచంద్రమ్మ, వెంకట్‌ మాట్లాడుతూ.. ఆస్తిని ప్రభుత్వానికి వితరణగా ఇవ్వడంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ల సహకారం మరువలేనిదని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు