కోడూరు-మేదరమెట్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో నాలుగు ప్యాకేజీల బిడ్లు ఖరారు

శ్రీసత్యసాయి జిల్లాలోని కోడూరు నుంచి ప్రకాశం జిల్లా మేదరమెట్ల వరకు నిర్మించనున్న ఆరు/నాలుగు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో నాలుగు ప్యాకేజీల టెండర్లను భారత జాతీయరహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఖరారు చేసింది.

Updated : 03 Feb 2023 11:04 IST

ఈనాడు,అమరావతి: శ్రీసత్యసాయి జిల్లాలోని కోడూరు నుంచి ప్రకాశం జిల్లా మేదరమెట్ల వరకు నిర్మించనున్న ఆరు/నాలుగు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో నాలుగు ప్యాకేజీల టెండర్లను భారత జాతీయరహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఖరారు చేసింది. వీటిలో చెరో రెండింటిని దిలీప్‌ బిల్డ్‌కాన్‌, రాజ్‌పత్‌ ఇన్‌ఫ్రా సంస్థలు దక్కించుకున్నాయి.

* ప్యాకేజీ-1 చిలమత్తూరు మండలం కోడూరు నుంచి గోరంట్ల మండలం వనవోలు వరకు 24.3 కి.మీ.కు అంచనా విలువ రూ.594.10 కోట్లుకాగా, అంతకంటే 0.9 శాతం అధికంగా కోట్‌చేసి దిలీప్‌ బిల్డ్‌కాన్‌ బిడ్‌ దక్కించుకుంది.

* ప్యాకేజీ-2 వనవోలు నుంచి నల్లమాడ మండలం వంకరకుంట వరకు 21.4 కి.మీ.కు అంచనా రూ.479.68 కోట్లుకాగా, 3.84 శాతం తక్కువకు కోట్‌చేసి రాజ్‌పత్‌ ఇన్‌ఫ్రా సొంతం చేసుకుంది.

* ప్యాకేజీ-3 వంకరకుంట నుంచి తలుపుల మండలం ఓదులపల్లి వరకు 26.3 కి.మీ.కు రూ.675.15 కోట్ల అంచనా విలువతో టెండరు పిలవగా, రాజ్‌పత్‌ ఇన్‌ఫ్రా 3.26 శాతం అదనంగా కోట్‌చేసి టెండరు దక్కించుకుంది.

* ప్యాకేజీ-4 ఓదులపల్లి నుంచి వైఎస్‌ఆర్‌ జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లి వరకు 24.3 కి.మీ.కు రూ.740 కోట్ల అంచనా విలువతో టెండరు పిలవగా, దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ 4.6 శాతం ఎక్కువకు కోట్‌చేసి బిడ్‌ను సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని