మూడేళ్లు దాటినా ఇంటి బిల్లివ్వరేం?
ఇంటి నిర్మాణం చేపట్టి మూడేళ్లయినా బిల్లులు మంజూరుచేయలేదంటూ నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం కొండుపల్లెకు చెందిన వల్లంపాటి లక్ష్మమ్మ, కుమారుడు కృష్ణుడితో కలిసి గృహనిర్మాణ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
హౌసింగ్ కార్యాలయం ఎదుట తల్లీకుమారుడి నిరసన
ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: ఇంటి నిర్మాణం చేపట్టి మూడేళ్లయినా బిల్లులు మంజూరుచేయలేదంటూ నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం కొండుపల్లెకు చెందిన వల్లంపాటి లక్ష్మమ్మ, కుమారుడు కృష్ణుడితో కలిసి గృహనిర్మాణ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ‘సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే బిల్లు ఇస్తామన్న సీఎం జగన్ మాటలను నమ్మి రూ.3.5 లక్షలు అప్పుచేసి పనులు చేపట్టాం. దివ్యాంగుడైన నా కుమారుడు కృష్ణుడు అహోబిలం క్షేత్రం వద్ద బిచ్చమెత్తుకొని ఇంటి పైకప్పు వరకూ పనులు పూర్తి చేసినా ఒక్క బిల్లూ ఇవ్వలేదు. మూడేళ్లుగా ఎన్నిసార్లు అడిగినా స్పందించని అధికారులు.. సాంకేతిక సమస్య వల్ల మీకు ఇల్లు మంజూరుకాలేదు. కుమారుడి పేరిట తాజాగా దరఖాస్తు చేస్తాం అంటున్నారు’ అని లక్ష్మమ్మ కంటతడి పెట్టుకుంటూ బోరున విలపించారు. దీనిపై వర్క్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ సాంకేతిక సమస్యను పరిశీలించి లక్ష్మమ్మ కుమారుడికి గృహాన్ని మంజూరు చేస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..
-
Congress: సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మధుయాష్కీ
-
Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం