గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల్లో 82 శాతం మంది అర్హత సాధించారు. ఈ పరీక్షల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం విడుదల చేశారు.

Updated : 09 Jun 2023 06:07 IST

ఈనాడు, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల్లో 82 శాతం మంది అర్హత సాధించారు. ఈ పరీక్షల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం విడుదల చేశారు. పాఠశాల స్థాయిలో 5,6,7,8 తరగతులు, ఇంటర్మీడియట్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు 1.06 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 87,252 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన వారందరికీ ర్యాంకులు కేటాయించారు. అన్నింటిలో కలిపి 4,852 సీట్లు అందుబాటులో ఉన్నందున మొదటి 4 వేల ర్యాంకులు సాధించిన వారికి సీట్లు కేటాయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని