TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ

పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది.

Updated : 19 Mar 2024 11:08 IST

 

పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది.

అంటూ దారపనేని నరేంద్ర, పెద్ది వంశీ ఆధ్వర్యంలో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై పాటను రూపొందించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, టీడీ జనార్దన్‌, ధూళిపాళ్ల నరేంద్రతో పాటు పలువురు నాయకులు సోమవారం పాట సీడీని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ‘చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక 206 మంది కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందారు. వారి కుటుంబాలను నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో పరామర్శిస్తూ ఆదుకుంటున్నారు. ఇప్పటిదాకా పది విడతలుగా 33 రోజుల పాటు 6,092 కిలోమీటర్లు ప్రయాణించారు. 20 పార్లమెంటు, 66 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి, 149 మంది కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, బాధితుల కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపారు. మిగిలిన వారినీ ఆదుకోవడానికి ముందుకు సాగుతున్నారు’ అని చెప్పారు.

 ఈనాడు డిజిటల్‌, అమరావతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని