బెంబేలెత్తిస్తున్న భానుడు

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్‌లోనే భానుడు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. శుక్రవారం 61మండలాల్లో తీవ్ర వడగాలులు, 117మండలాల్లో వడగాలులు వీచాయి.

Published : 20 Apr 2024 04:55 IST

నేడు 55మండలాల్లో తీవ్ర వడగాలులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్‌లోనే భానుడు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. శుక్రవారం 61మండలాల్లో తీవ్ర వడగాలులు, 117మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలో అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.7డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వైయస్‌ఆర్‌ జిల్లా సింహాద్రిపురంలో 45.6, నంద్యాల జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 45.5, విజయనగరంలోని రామభద్రాపురంలో 44.9డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం 55మండలాల్లో తీవ్ర వడగాలులు, 197 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ ఓ ప్రకటనలో హెచ్చరించారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

శనివారం తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న మండలాలు: విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యం 15, శ్రీకాకుళం 11, అనకాపల్లి 6.

వడగాలులు వీచే అవకాశమున్న మండలాలు: పల్నాడు జిల్లాలో 25, ప్రకాశం 21, గుంటూరు 17, తూర్పుగోదావరి 17, శ్రీకాకుళం 15, కాకినాడ 14, ఏలూరు 12, కృష్ణా 12, అల్లూరి సీతారామరాజు 10, అనకాపల్లి 10, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 10, ఎన్టీఆర్‌ 9, బాపట్ల 9, తిరుపతి 5,   బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ 4, విశాఖపట్నం 3, విజయనగరం 3, పశ్చిమగోదావరి 1.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని