తాడేపల్లిలో డ్రగ్స్‌ కలకలం

గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్‌ పట్టుపడటం కలకలం రేపింది.

Published : 05 May 2024 06:43 IST

సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలో స్వాధీనం

తాడేపల్లి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్‌ పట్టుపడటం కలకలం రేపింది. ముందస్తు సమచారం మేరకు మంగళగిరి సెబ్‌ అధికారులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.5.28 లక్షల విలువైన 88 గ్రాముల మిథాంఫిటమిన్‌ (మెథ్‌)ను స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరిలో శనివారం సెబ్‌ సూపరింటెండెంట్‌ రంగారెడ్డి, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ కృష్ణకిషోర్‌రెడ్డిలు విలేకరులకు వివరాలు వెల్లడించారు. తాడేపల్లి పరిధి కుంచనపల్లి గ్రామానికి చెందిన రవికిరణ్‌ అలియాస్‌ కిట్టయ్య, రఘునందన సాంబమూర్తి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన దేవీప్రసాద్‌ శశాంకవర్మలు కలసి బెంగళూరు నుంచి మిథాంఫిటమిన్‌ తీసుకొస్తుండగా ప్రాతూరు క్రాస్‌రోడ్డు వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు బెంగళూరులో ఓ వ్యక్తి నుంచి ‘మెథ్‌’ను తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడ, గుంటూరుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ కేసులో మరికొంతమంది అరెస్టు కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని