Omicran:నేటి నుంచి పిల్లలకు కొవిడ్‌ టీకా

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి పిల్లలకూ కొవిడ్‌ టీకా వేయనున్నారు. 15-18 ఏళ్ల మధ్య వయసు గలవారికి వారికి వ్యాక్సిన్‌ వేసేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీరందరికీ

Updated : 03 Jan 2022 06:11 IST

15-18 ఏళ్ల మధ్య వయసున్న వారికి వేసేందుకు ఏర్పాట్లు
ఈ నెల 7 వరకూ ప్రత్యేక డ్రైవ్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి పిల్లలకూ కొవిడ్‌ టీకా వేయనున్నారు. 15-18 ఏళ్ల మధ్య వయసు గలవారికి వారికి వ్యాక్సిన్‌ వేసేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీరందరికీ కొవాగ్జిన్‌ టీకా ఇవ్వనుంది. ఈ నెల 7వ తేదీ వరకూ దీనికోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనుంది. 15-18 ఏళ్ల వయోవర్గానికి చెందిన చెందిన 24 లక్షల మందికి ఈ వ్యాక్సిన్‌ ఇస్తారు. ఆదివారం రాత్రి దాదాపు 18 లక్షల మంది బాలబాలికల ఆధార్‌ నెంబర్లు సేకరించారు. తర్వాతి దశలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వ్యాక్సిన్‌ వేస్తారు. వీరందరికీ నాలుగు వారాల తర్వాత రెండో డోసు వేయనున్నారు. మరోవైపు 60 ఏళ్ల వయసు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మూడో డోసు ఇచ్చేందుకూ వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. ఈ నెల 10 నుంచి ఆ వయసు వారికి బూస్టర్‌ డోస్‌ వేయనున్నారు.

ప్రత్యేక కేంద్రాలు
ఈనాడు, దిల్లీ: దేశంలో 15-18 ఏళ్ల పిల్లలకు టీకాల విషయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఇతర వయసుల వారితో సంబంధం లేకుండా పిల్లలకు ప్రత్యేకంగా టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.  

టీకాలకు 6.35 లక్షల రిజిస్ట్రేషన్లు
దేశవ్యాప్తంగా కొవిడ్‌ టీకాల కోసం ఆదివారం సాయంత్రం వరకు 6.35 లక్షల మంది 15-18 ఏళ్ల పిల్లలు కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఈ వయసు వారి కోసం రిజిస్ట్రేషన్లకు శనివారం నుంచి ప్రభుత్వం అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని