భారత్‌ బయోటెక్‌తో బ్రెజిల్‌ ఒప్పందం!

దేశీయ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌తో బ్రెజిల్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 20 మిలియన్‌ డోసుల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కోసం ఆ దేశ ఆరోగ్య శాఖ భారత కంపెనీలో కొనుగోలు ఒప్పందం చేసుకుంది........

Updated : 26 Feb 2021 12:59 IST

సావో పాలో(బ్రెజిల్‌) : దేశీయ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌తో బ్రెజిల్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 20 మిలియన్‌ డోసుల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కోసం ఆ దేశ ఆరోగ్య శాఖ భారత కంపెనీతో కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అయితే, దీన్ని ఇంకా స్థానిక అధికార యంత్రాంగాలు ధ్రువీకరించాల్సి ఉంది. 20 మిలియన్‌ డోసుల్లో తొలి 8 మిలియన్లు బ్రెజిల్‌లోని ప్రెసిసా మెడికామెంటోస్‌లోనే ఉత్పత్తి అవుతాయని.. అవి మార్చి నాటికి అందుతాయని ఆ దేశ అధ్యక్షుడు బోల్సోనారో అధికార యంత్రాంగం వెల్లడించింది. మిగిలిన 8 మిలియన్ల డోసులు ఏప్రిల్‌లో, తదుపరి నాలుగు మిలియన్ల డోసులు మే నాటికి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 1,03,90,461 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 2,51,498 మంది మృత్యువాతపడ్డారు. కేసులపరంగా బ్రెజిల్‌ ప్రపంచంలో మూడో స్థానంలో ఉండగా.. మరణాల్లో రెండో స్థానంలో ఉంది. ఆ దేశ జనాభా 21 కోట్ల కాగా.. ఇప్పటి వరకు దాదాపు నాలుగు శాతం మందికి టీకా అందింది. అయితే, ప్రెసిసాగానీ, భారత్‌ బయోటెక్‌గానీ తమ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటించకపోవడం గమనార్హం.

ఇవీ చదవండి...

ఆర్థిక లక్ష్యం చేరాలంటే...

పెట్రోపై పన్నులు క్రమేణ తగ్గించాలి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని