తెలంగాణలో కాఫీ ఎగుమతులు 54% వృద్ధి

కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ తెలంగాణలో కాఫీ ఎగుమతులు 54 శాతం మేర వృద్ధి చెందినట్లు అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక సంస్థ డ్రిప్‌ క్యాపిటల్‌ నివేదిక వెల్లడించింది. 2019-20లో తెలంగాణ నుంచి 13 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.97 కోట్లు)

Published : 26 Jul 2021 01:55 IST

డ్రిప్‌ క్యాపిటల్‌ నివేదిక

హైదరాబాద్‌: కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ తెలంగాణలో కాఫీ ఎగుమతులు 54 శాతం మేర వృద్ధి చెందినట్లు అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక సంస్థ డ్రిప్‌ క్యాపిటల్‌ నివేదిక వెల్లడించింది. 2019-20లో తెలంగాణ నుంచి 13 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.97 కోట్లు) కాఫీ ఎగుమతులు జరగగా, 2020-21లో ఇవి 20 మిలియన్‌ డాలర్లకు (రూ.150 కోట్లు) చేరాయని తెలిపింది. ఇందులోనూ అధిక భాగం ఇన్‌స్టంట్‌ కాఫీ ఎగుమతులే ఉన్నాయని పేర్కొంది. వీటి ఎగుమతి పరిమాణం 10 ఏళ్లకు 4 శాతం సంచిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) సాధించగా, ఎగుమతి విలువ 8 శాతం సీఏజీఆర్‌ను నమోదు చేసిందని వివరించింది. ‘విపణిలో ఈ రకమైన కాఫీకి ఆదరణ బాగా ఉండటంతో మంచి ధర రావడానికి అవకాశం ఉంది. అందుకే భారతీయ ఎగుమతిదార్లు ఇన్‌స్టంట్‌ కాఫీ ఎగుమతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరిన్ని కాఫీ ప్రాసెసింగ్‌ ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చ’ని డ్రిప్‌ క్యాపిటల్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓ పుష్కర్‌ ముకేవర్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని