క్రెడిట్ కార్డ్ కంటే ఛార్జ్ కార్డ్ మేలైన‌దా?

దాదాపుగా అంద‌రి ద‌గ్గ‌ర క‌నీసం ఒక క్రెడిట్ కార్డ్ ఉండ‌టం ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. క్రెడిట్ కార్డు వంటిదే ఛార్జ్ కార్డ్ కూడా. దీంతో కూడా రివార్డులు, ప‌రిమితులు వంటివి ల‌భిస్తాయి. కానీ, క్రెడిట్ కార్డు గురించి తెలిసినంత‌గా ఛార్జ్ కార్డ్ గురించి అంద‌రికి తెలియ‌దు. అన్ని బ్యాంకులు ఛార్జ్ కార్డుల‌ను జారీచేయ‌వు. దేశంలో ప్ర‌స్తుతం 50 మిలియ‌న్ల‌కు పైగా క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి...

Updated : 01 Jan 2021 19:40 IST

దాదాపుగా అంద‌రి ద‌గ్గ‌ర క‌నీసం ఒక క్రెడిట్ కార్డ్ ఉండ‌టం ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. క్రెడిట్ కార్డు వంటిదే ఛార్జ్ కార్డ్ కూడా. దీంతో కూడా రివార్డులు, ప‌రిమితులు వంటివి ల‌భిస్తాయి. కానీ, క్రెడిట్ కార్డు గురించి తెలిసినంత‌గా ఛార్జ్ కార్డ్ గురించి అంద‌రికి తెలియ‌దు. అన్ని బ్యాంకులు ఛార్జ్ కార్డుల‌ను జారీచేయ‌వు. దేశంలో ప్ర‌స్తుతం 50 మిలియ‌న్ల‌కు పైగా క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మాత్ర‌మే వివిధ రకాల రిటైల్ ఛార్జ్ కార్డుల‌ను అందిస్తుంది. ఇత‌ర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థ‌లు ఛార్జ్ కార్డుల‌ను కార్పొరేట్ కార్డుల రూపంలో అందిస్తాయి. అన్ని కార్పొరేట్ కార్డులు కంపెనీల పేరుతో ఉంటాయి.

వినియోగం
ఛార్జ్ కార్డుల‌న్నీ బ్రాండెడ్ కార్డులు. అవి అన్ని పాయింట్ ఆఫ్ సేల్ లేదా ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేల వ‌ద్ద బ్రాండ్‌ల కొనుగోలుకు అనుమ‌తిస్తాయి. అయితే క్రెడిట్, ఛార్జ్ కార్డుల మ‌ధ్య‌ ఒక వ్య‌త్యాసం ఉంది. క్రెడిట్ కార్డుల ప‌రిమితి సాధార‌ణంగా నెల‌వారి ఆదాయానికి మూడు లేదా నాలుగు రెట్లుగా ఉంటుంది. ఛార్జ్‌కార్డుల ప‌రిమితి ఎక్కువ‌గా ఉంటుంది. చాలావ‌ర‌కు ముంద‌స్తు ప‌రిమితి ఉండ‌దు. మీకు క్రెడిట్ కార్డు ఇచ్చేముందు బ్యాంకులు మీ క్రెడిట్ లిమిట్‌ను స్ప‌ష్టంగా తెలియ‌జేస్తాయి. కానీ, ఛార్జ్ కార్డుల విష‌యంలో ఇది జ‌ర‌గ‌దు. వ్య‌య ప‌రిమితులు ఉన్న‌ప్ప‌టికీ అవి ముందుగానే నిర్ణ‌యించ‌రు. అంటే అవ‌స‌రాన్ని బ‌ట్టి ప‌రిమితిని పెరంచుకోవ‌చ్చు. క్రెడిట్ కార్డు కంటే ఇది ప‌రిమితి విష‌యంలో సౌక‌ర్యంగా ఉంటుంది. పరిమితిని కాలక్రమేణా పొడిగించవచ్చు. క్రెడిట్ కార్డుల విష‌యంలో మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, బిల్లులు క్ర‌మంగా చెల్లిస్తే కార్డు ప‌రిమితి పెరుగుతుంది.

మొత్తం చెల్లింపు
ఛార్జ్ కార్డులు క్రెడిట్ కార్డుల మధ్య మరొక ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ఛార్జ్ కార్డుతో బకాయి మొత్తాన్ని తిరిగి ఒకేసారి గడువు లోపు చెల్లించాలి. అయితే క్రెడిట్ కార్డులో, మొత్తం బకాయిల్లో క‌నీస మొత్తం చెల్లిస్తూ కార్డును ఎప్ప‌టిలాగానే వాడుకోవ‌చ్చు. అందుకే ఛార్జ్ కార్డులు సాధారణంగా అధిక సంపాదన ఉన్న‌వారి కోసం ఉద్దేశించిన కార్డులుగా చెప్తారు. క్రెడిట్ కార్డుల విష‌యంలో బిల్లు చెల్లింపుల్లో సౌల‌భ్యం ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ కార్డును కొనసాగించడానికి కనీస బ్యాలెన్స్ చెల్లించవ‌చ్చు, అయితే ఇది బకాయి మొత్తానికి వడ్డీని విధిస్తుంది, అయితే ఛార్జ్ కార్డు విషయంలో, కనీస చెల్లింపు పరిమితి ఉండదు. మీరు నెలవారీ బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించాలి. లేకపోతే, బకాయి మొత్తంపై చాలా ఎక్కువ వడ్డీ లేదా అపరాధ రుసుము వర్తిస్తుంది. క్రెడిట్ కార్డులా కాకుండా వడ్డీ ఆదాయం లేనందున చాలా సందర్భాల్లో ఛార్జ్ కార్డు రుసుమును కలిగి ఉంటుంది, ఇది ఒక నిర్దిష్ట కాలానికి లేదా కనీస ఖర్చులకు అనుగుణంగా ఉచితంగా అందిస్తారు. క్రెడిట్ కార్డ్ బిల్లుపై మీరు చెల్లించే వడ్డీ రేటు లాగా ఛార్జ్ కార్డుల‌పై వ‌ర్తించే రుసుముల‌ను భావించ‌వ‌చ్చు.

ఉదాహరణకు, అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం కార్డుపై, ప్రతి నెల చెల్లింపు గడువు తేదీ లోపు పూర్తి బిల్లు మొత్తాన్ని చెల్లించకపోతే 3.5% చొప్పున అపరాధ రుసుమును వసూలు చేస్తుంది. చెల్లించని అపరాధ రుసుములు ఆలస్యమైన రుణ‌ మొత్తానికి జోడించి, కాంపౌండింగ్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోతే తదుపరి బిల్లు కాలానికి దానిపై విధించే అపరాధ రుసుము ఉంటుంది.

ఎక్కువ వ్య‌యానికి అధిక‌ రివార్డులు
ఛార్జ్ కార్డులు సాధారణంగా అధిక సంపాద‌న ఉన్న‌వారికి లక్ష్యంగా చేసుకుంటాయి. దీంతో విభిన్నమైన బహుమతులు ప్రయోజనాలను అందిస్తాయి. దేశీయంగా అంతర్జాతీయంగా తరచూ ప్రయాణించే 40-50 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన వ్యాపారులు, నిపుణులకు ఈ కార్డులు స‌దుపాయంగా ఉంటాయి. ప్లాటినం కార్డ్ ప్రత్యేకమైన, నిరంత‌ర సేవ‌ల‌ను అందిస్తుంది.

వార్షిక ఛార్జీలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్, రెండు ఛార్జ్ కార్డుల‌ను దేశంలో అందిస్తుంది. గోల్డ్ కార్డ్ కోసం వెయ్యి రూపాయ‌లు మొద‌టి ఏడాదికి, రెండో ఏడాదికి రూ.4,500 చెల్లించాలి. ప్లాటినం కార్డ్ వార్షిక ఫీజు ఏడాదికి రూ.60,000. చాలావ‌ర‌కు క్రెడిట్ కార్డులు వార్షిక ఫీజులు వ‌సూలు చేయ‌వు. చేసిన‌ప్ప‌టికీ నామ‌మాత్రంగానే చేస్తాయి. కాని త‌క్కువ‌ రివార్డుల‌నే అందిస్తాయి.

తరచూ ప్రయాణించేవారు, ఎక్కువ ఖర్చు చేసేవారు అయితే, మీరు ఛార్జ్ కార్డును పరిగణించవచ్చు. అయితే మీరు అధిక వార్షిక రుసుము చెల్లించటానికి ఆసక్తి చూపకపోతే పాత క్రెడిట్ కార్డుల‌నే కొన‌సాగించ‌డం మంచిది. ప‌రిమితి లేనందును అవ‌న‌సర ఖ‌ర్చులు చేసే అవ‌కాశం ఉంటుంది. క్రెడిట్ కార్డులో ఉన్న ప‌రిమితి ఖర్చులను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ క్రెడిట్ కార్డులను గరిష్టంగా ఉపయోగించడం మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు