Go Fashion: ఒక్కో షేరుపై రూ.620 లాభం.. లిస్టింగ్‌లో అదరగొట్టిన గో ఫ్యాషన్‌

గో కలర్స్‌ బ్రాండుపై మహిళల దుస్తులు విక్రయించే గో ఫ్యాషన్‌ (ఇండియా) షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. తొలిరోజే అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నాయి....

Published : 30 Nov 2021 13:28 IST

దిల్లీ: గో కలర్స్‌ బ్రాండుపై మహిళల దుస్తులు విక్రయించే గో ఫ్యాషన్‌ (ఇండియా) షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. తొలిరోజే అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నాయి. ఇష్యూ ధర రూ.690 కంటే 90.72 శాతం ప్రీమియంతో రూ.1,316 వద్ద బీఎస్‌ఈలో.. 89.86 శాతం ప్రీమియంతో రూ.1,310 వద్ద ఎన్‌ఎస్‌ఈలో షేర్లు నమోదయ్యాయి. ఐపీఓలో ఒక్కో లాట్‌కు 21 షేర్లు నిర్ణయించారు. అంటే ఒక్కో లాట్‌పై రూ.13,755 పెట్టుబడిగా పెట్టారు. దీంతో 89.86 శాతం ప్రీమియం లెక్కన ఒక్కో లాట్‌పై మదుపర్లు రూ.13,180 లిస్టింగ్ గెయిన్స్‌ సంపాదించారు. మధ్యాహ్నం 12:48 గంటల సమయంలో నిఫ్టీలో ఈ షేరు 78 శాతం లాభంతో రూ.1,233 వద్ద ట్రేడవుతోంది.       

ఈ కంపెనీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) నవంబరు 17న ప్రారంభమై 22న ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.1,015 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రూ.125 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లకు చెందిన 1,28,78389 షేర్లను విక్రయించారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను 120 కొత్త విక్రయ కేంద్రాల ఏర్పాటుకు, మూలధన అవసరాలకు, సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాలకు కంపెనీ వినియోగించనుంది.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని