Honda CB200X: హోండా నుంచి కొత్త బైక్.. ధర, ప్రత్యేకతలివీ..
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మరో కొత్త బైక్‌ను విడుదల చేసింది. CB200X పేరిట కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధరను...
దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మరో కొత్త బైక్‌ను విడుదల చేసింది. CB200X పేరిట కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.44 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్, గురుగ్రామ్) నిర్ణయించింది. రోజువారీ అవసరాలతో పాటు ఆఫ్‌రోడ్ రైడింగ్‌కు అనుగుణంగా ఈ బైక్‌ను హోండా తీర్చిదిద్దింది. హీరో ఎక్స్‌పల్స్ 200కు పోటీగా ఈ బైక్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మారుతున్న పట్టణ యువత జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని వారికి అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందించే ఉద్దేశంతో CB200Xను తీర్చిదిద్దినట్లు హోండా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీఈవో అత్సుషి ఒగాటా బైక్ విడుదల సందర్భంగా పేర్కొన్నారు. ఈ బైక్ రోజువారీ అవసరాలు తీర్చడంతోపాటు వారాంతపు ప్రయాణాలకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇక ప్రత్యేకతల విషయానికొస్తే.. బీఎస్-6 ప్రమాణాలతో 184 సీసీ ఇంజిన్‌తో ఈ బైక్ వస్తోంది. ఇది 8,500 ఆర్పీఎం వద్ద 17 బీహెచ్పీని, 6000 ఆర్పీఎం వద్ద 16.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్‌ను అమర్చారు. గతంలో వచ్చిన హార్నెట్ 2.0లోనూ ఇదే ఇంజిన్ ఉంది. CB200Xలో ఎల్ఈడీ లైట్ సెటప్, పూర్తి డిజిటల్ లిక్విడ్ క్రిస్టల్ మీటర్, స్ప్లిట్ సీట్, సింగిల్ ఛానల్ ఏబీఎస్, ముందూ వెనుక డిస్క్ బ్రేకులను అందిస్తున్నారు. ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, వచ్చే నెల నుంచి డెలివరీలు మొదలు కానున్నాయని కంపెనీ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్‌హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..