Housing Sales: హైదరాబాద్‌లో 4 రెట్లు పెరిగిన ఇళ్ల అమ్మకాలు

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్‌ వెల్లడించింది.

Updated : 30 Sep 2021 10:38 IST

 ఏడు నగరాల్లో 3 శాతం పెరిగిన ధరలు

దిల్లీ: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్‌ వెల్లడించింది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ఐటీ/ఐటీ ఆధారిత రంగాల్లో నియామకాలు పెరగడంతో ఈ గిరాకీ సాధ్యం అయ్యిందని పేర్కొంది. దిల్లీ, ముంబయి, చెన్నై, కోలక్‌తా, బెంగళూరు, హైదరాబాద్, పుణె మార్కెట్లను ఈ సంస్థ విశ్లేషించింది. దేశ వ్యాప్తంగా జులై-సెప్టెంబరు మధ్య  62,800 యూనిట్లు అమ్ముడయ్యాయని పేర్కొంది. సగటు ధర చదరపు అడుగుకు రూ.5,600 నుంచి రూ.5,760కి పెరిగిందని తెలిపింది. హైదరాబాద్‌లో 2020 జులై-సెప్టెంబరులో 1,650 నివాస యూనిట్లు అమ్ముడవ్వగా.. ఈ ఏడాది ఇదే కాలంలో నాలుగు రెట్లు అధికంగా 6,735 యూనిట్లు కొనుగోలు చేశారని పేర్కొంది. ఈ మూడో త్రైమాసికంలో కొత్తగా ఏడు నగరాల్లో దాదాపు 64,560 యూనిట్లు ప్రారంభం అయ్యాయని వెల్లడించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు