Online SBI FD: ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ ‘ఎఫ్‌డీ’ వ‌డ్డీ ధృవీక‌ర‌ణ ప‌త్రం ఎలా పొందాలి ?

దీనిని 4 సాధార‌ణ ద‌శ‌ల్లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Updated : 23 Jul 2021 13:33 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆన్‌లైన్ ఎఫ్‌డీ వ‌డ్డీ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని పొంద‌డం చాలా సుల‌భం అని ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది. ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ అధికారిక వెబ్‌సైట్‌.. onlinesbi.comలో లాగిన్ అవ్వ‌డం ద్వారా ఆన్‌లైన్‌లో త‌మ ఎఫ్‌డీ వ‌డ్డీ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని పొంద‌వ‌చ్చ‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు సుల‌భ‌త‌రం చేయ‌డానికి ఎస్‌బీఐ వివిధ కార్య‌క్ర‌మాలు చేస్తోంది. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారుల‌కు  వ‌డ్డీ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని ఆన్‌లైన్‌లో పొంద‌డానికి అనుమ‌తించ‌డం ఈ విష‌యంలో మ‌రో అడుగు. అతిపెద్ద భార‌తీయ వాణిజ్య బ్యాంక్ ఇపుడు ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ అధికారిక వెబ్‌సైట్‌.. onlinesbi.comలో లాగిన్ అవ్వ‌డం ద్వారా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ సేవ ద్వారా త‌మ ఎఫ్‌డీ వ‌డ్డీ ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. దీనిని 4 సాధార‌ణ ద‌శ‌ల్లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

1) అధికారిక ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి. onlinesbi.com వ్య‌క్తిగ‌త బ్యాంకింగ్ విభాగంలో క్లిక్ చేయండి.

2) వ్య‌క్తిగ‌త బ్యాంకింగ్ విభాగంలో లాగిన్ అయిన త‌ర్వాత `ఇ-స‌ర్వీస్‌` టాబ్‌ను సంద‌ర్శించండి.

3) `మై స‌ర్టిఫికేట్లు` టాబ్ వ‌ద్ద క్లిక్ చేయండి.

4) డిపాజిట్ అక్కౌంట్ల వ‌డ్డీ ధృవ ప‌త్రాల‌పై క్లిక్ చేయండి.. వ‌చ్చిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ వ‌డ్డీ స‌ర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

ఒక ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ పైన పేర్కొన్న 4 ద‌శ‌ల‌ను ఆన్‌లైన్ఎస్‌బీఐ.కామ్‌లో అనుస‌రిస్తే సుల‌భంగా ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ వ‌డ్డీ ధృవీక‌ర‌ణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని పొంద‌గ‌లుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని