ఆ చమురు నిల్వలు వాడితే ధరలు తగ్గించొచ్చు

పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌), దాని అనుబంధ దేశాలు చమురు ఉత్పత్తి పెంచడానికి అంగీకరించని నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా పెరిగాయి. ముడి చమురు ఉత్పత్తి కోతలు తగ్గించాలని...

Updated : 17 Oct 2022 14:50 IST

భారత్‌కు సూచించిన సౌదీ అరేబియా

దిల్లీ: పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌), దాని అనుబంధ దేశాలు చమురు ఉత్పత్తి పెంచడానికి అంగీకరించని నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా పెరిగాయి. ముడి చమురు ఉత్పత్తి కోతలు తగ్గించాలని భారత ప్రభుత్వం ఇటీవల చేసిన అభ్యర్థనను సౌదీ అరేబియా పట్టించుకోలేదు. ‘గత ఏడాది అతి తక్కువ ధరలో చమురు కొనుగోలు చేశారు కదా.. ఆ నిల్వల్ని ఇప్పుడు వాడుకుంటే, దేశీయంగా ధరలు తగ్గించవచ్చు’ అని భారత్‌కు సౌదీ అరేబియా సూచించింది. శుక్రవారం బ్రెంట్‌ ముడి చమురు 1 శాతం మేర పెరిగి 67.44 డాలర్లకు చేరింది. ఒపెక్‌+ దేశాలు ఏప్రిల్‌ వరకు సరఫరా పెంచకుండా, సరైన గిరాకీ వచ్చే వరకు ఎదురుచూడాలని నిర్ణయించుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌-మేలో భారత్‌ 1.67 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసి, 3 చోట్ల నిల్వ చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో విశాఖపట్నం, కర్ణాటకలో మంగళూరు, పాడూర్‌ వద్ద ఈ నిల్వలు ఉన్నాయి. ఒక్కో బ్యారెల్‌ 19 డాలర్ల సరాసరి ధరతో కొనుగోలు చేసినట్లు గత సెప్టెంబరు 21న రాజ్యసభలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని