Passenger vehicle sales: ఆగస్టు ప్యాసెంజర్‌ వాహన విక్రయాల్లో 39% వృద్ధి!

ఆగస్టులో ప్యాసెంజర్‌ వాహనాల రిటైల్‌ విక్రయాల్లో 39 శాతం వృద్ధి నమోదైనట్లు ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌(ఎఫ్‌ఏడీఏ)’ వెల్లడించింది...

Published : 07 Sep 2021 14:01 IST

దిల్లీ: ఆగస్టులో ప్యాసెంజర్‌ వాహనాల రిటైల్‌ విక్రయాల్లో 39 శాతం వృద్ధి నమోదైనట్లు ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌(ఎఫ్‌ఏడీఏ)’ వెల్లడించింది. 2020 ఆగస్టులో 1,82,651 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఆగస్టులో అవి 2,53,363కి పెరిగాయి. ద్విచక్రవాహనాల విక్రయాలు 2020, ఆగస్టులో 9,15,126 అమ్ముడయ్యాయి. ఈసారి అవి 7 శాతం పెరిగి 9,76,051 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక వాణిజ్య వాహన విక్రయాలు భారీగా పుంజుకున్నాయి. 2019 ఆగస్టులో 26,851 వాహనాలు అమ్ముడు కాగా.. ఈసారి అవి 98 శాతం పెరిగి 53,150 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక త్రీవీలర్‌ విక్రయాలు సైతం 80 శాతం పెరిగాయి. ట్రాక్టర్‌ అమ్మకాల్లో 35.49 శాతం వృద్ధి నమోదైంది. స్థూలంగా అన్ని విభాగాల్లో కలిపి ఆగస్టులో వాహన విక్రయాలు 14 శాతం పెరిగాయి. 2019, ఆగస్టులో 12,09,550 యూనిట్లు విక్రయించగా.. ఈ ఆగస్టులో ఆ సంఖ్య 13,84,711కు ఎగబాకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని