Petrol Diesel Price Hike: ఆగని పెట్రో ధరల మోత!

దేశంలో ఇంధన ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. శుక్రవారం (22-10-2021) లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై గరిష్ఠంగా 35 పైసల చొప్పున ఎగబాకాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.89,  డీజిల్‌ రూ.95.62కు చేరింది....

Updated : 17 Oct 2022 14:33 IST

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. శుక్రవారం (22-10-2021) లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై గరిష్ఠంగా 35 పైసల చొప్పున ఎగబాకాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.89,  డీజిల్‌ రూ.95.62కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.112.78, రూ.103.63గా ఉన్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్ర రాజధానుల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటేయగా.. డీజిల్‌ ధర సైతం మరికొన్ని రోజుల్లో ఆ మార్క్‌ను దాటేయనుంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.118.54గా నమోదైంది. ఇక్కడ డీజిల్‌ ధర రూ.109.41 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 84 డాలర్లుగా నమోదవుతోంది. సెప్టెంబరు 27 తర్వాత పెట్రోల్‌ ధరను 19 సార్లు పెంచారు. దీంతో లీటర్‌ ధర రూ.5.7 మేర పెరిగింది. సెప్టెంబరు 24 తర్వాత డీజిల్‌ ధరను 22 సార్లు సవరించారు. దీంతో ధర రూ.7 మేర పెరిగింది.   

నగరం           పెట్రోల్‌(రూ.లలో)        డీజిల్‌(రూ.లలో)

హైదరాబాద్‌           111.18                 104.32

విజయవాడ           113.76                 106.23

విశాఖపట్నం          111.96                 104.53

దిల్లీ                  106.89                 95.62

ముంబయి            112.78                 103.63

చెన్నై                 104.01                 100.01

బెంగళూరు           110.61                  101.49

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు