ప్రామాణిక తగ్గింపు రూ.లక్ష!

కరోనాతో దెబ్బతిన్న మధ్యతరగతి వర్గాలకు ఆదాయపు పన్ను మినహాయింపులు పెంచడం ద్వారా కొంత ఉపశమనం కల్గించే చర్యలను ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రామాణిక తగ్గింపును ప్రస్తుతం ఉన్న రూ.50,000 రూ.లక్షకు పెంచాలని కోరుకుంటున్నారు.

Updated : 16 Jan 2021 09:03 IST

బడ్జెట్‌పై పన్ను చెల్లింపుదారుల ఆశలు

కరోనాతో దెబ్బతిన్న మధ్యతరగతి వర్గాలకు ఆదాయపు పన్ను మినహాయింపులు పెంచడం ద్వారా కొంత ఉపశమనం కల్గించే చర్యలను ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రామాణిక తగ్గింపును ప్రస్తుతం ఉన్న రూ.50,000 రూ.లక్షకు పెంచాలని కోరుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగానే బడ్జెట్‌లో చర్యలు ఉండే అవకాశం ఉందనీ పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలకు సంబంధించి పలువురు ఆర్థికవేత్తలు ఇప్పటికే ఈ విషయంపై విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. వీటిని పరిగణనలోనికి తీసుకుంటే.. ప్రామాణిక తగ్గింపు రూ.75,000-రూ.లక్ష వరకూ ఉండే అవకాశం ఉందని పన్ను నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2019 మధ్యంతర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శ్లాబులను మార్చకుండా.. రూ.5లక్షల లోపు ఉన్నవారికి రిబేటు ప్రకటించారు. 2020 బడ్జెట్‌లోనూ శ్లాబులను మార్చకుండా.. కొత్త పన్నుల విధానాన్ని ప్రతిపాదించారు. మినహాయింపులు తీసుకోకుండా ఉన్నవారికి ప్రత్యేక శ్లాబులను ప్రకటించారు. ఈసారి బడ్జెట్‌లో శ్లాబులను మార్చకుండా.. ప్రామాణిక తగ్గింపును పెంచే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
స్కోడా సూపర్బ్‌ కొత్త వెర్షన్‌  ధర రూ.31.99లక్షలు
ఈనాడు, హైదరాబాద్‌: స్కోడా తన ప్రీమియం సెడాన్‌ సూపర్బ్‌ను పలు కొత్త మార్పులతో విడుదల చేసింది. ఇది రెండు మోడళ్లలో అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపింది. స్కోడా సూపర్బ్‌ స్పోర్ట్‌లైన్‌ ధర రూ.31.99 లక్షలు, లారిన్‌ అండ్‌ క్లెమెంట్‌ వేరియంట్‌ ధర రూ.34.99 లక్షలు అని వెల్లడించింది. ఈ రెండు వేరియంట్‌లలో 2 లీటర్‌ పెట్రోలు ఇంజిన్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపింది. లగ్జరీ కార్లను ఇష్టపడేవారి నుంచి స్కోడా సూపర్బ్‌కు మంచి ఆదరణ లభిస్తోందని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ జాక్‌ హోలిస్‌ అన్నారు. స్కోడా సూపర్బ్‌ కొత్త మోడళ్లలో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా పలు అదనపు హంగులు జోడించినట్లు తెలిపారు. నచ్చిన రీతిలో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌తోపాటు, అడాప్టివ్‌ ఫ్రంట్‌ లైటింగ్‌ సిస్టంలాంటివి ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని