Health Insurance: మ‌హిళా ఆరోగ్య బీమా.. ప్ర‌యోజ‌నాలు 

కొన్ని పాలసీలు జీవితకాలం పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తే, కొన్ని వయో పరిమితి విధిస్తున్నాయి.  

Updated : 23 Oct 2021 17:17 IST

 
కుటుంబ ఆరోగ్య బీమా లేదా సంస్థ అందించే బృంద పాలసీలో సభ్యులుగా ఉన్నాం కదా అని సరిపెట్టుకునే మ‌హిళ‌లు చాలా మంది ఉంటారు. రొమ్ము క్యాన్సర్, ఆర్థరైటిస్, ఓవేరియన్ పాలీసిస్టోసిస్ వంటివి ప్ర‌త్యేకంగా మ‌హిళ్ల‌లో క‌నిపించే ఆరోగ్య స‌మ‌స్య‌లు. గర్భవతిగా ఉన్నప్పుడు, పిల్లలను కన్న తర్వాత అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. ప్ర‌స్తుతం బీమా సంస్థలు జండ‌ర్ బేసెడ్ పాల‌సీల‌ను అందిస్తున్నాయి.  స్త్రీల‌ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పాలసీలు రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చాయి. మహిళలూ చొరవ తీసుకొని ఇలాంటి పాలసీ తీసుకోవడం మంచిది .
 
పాలసీ ప్రయోజనాలు...
*
మహిళల జీవితంలో కీలక దశ అయిన ప్రసూతి సమయంలో కలిగే వైద్య ఖర్చులకు బీమా తోడ్పాటునందిస్తుంది. అయితే, వీటికి 2-4 ఏళ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని గమనించాలి . 
* పిల్లలు అనారోగ్య సమస్యలతో జన్మించినా ఈ బీమా రక్షణగా ఉంటుంది.
* 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు ఉన్న మహిళలు ఈ పాలసీలు తీసుకునే అవకాశం ఉంది.
* తీవ్ర అనారోగ్య సమస్యలైన గర్భాశయ క్యాన్సర్, పక్షవాతం, కీళ్ల సమస్యలు వంటి వాటికి బీమా కల్పిస్తారు. ఇలాంటి సమయంలో ఆర్థిక భారం పడకుండా  ఈ పాలసీలు ఉపయోగపడతాయి.
* పాలసీ తీసుకున్న మొదటి 90 రోజుల్లోనే తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైనట్లు గుర్తిస్తే ఆ సమయంలో బీమా వర్తించదు ఇందుకు కార‌ణం..వెయిటింగ్ పీరియడ్.
* ఏదైనా ఆనారోగ్య సమస్యలను గుర్తించినప్పుడు 30 రోజుల కంటే ఎక్కువగా జీవించి ఉన్నట్లయితేనే బీమాకు అర్హులవుతారు.
పెద్ద వయసులో కూడా... కొన్ని పాలసీలు జీవితకాలం పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తే, కొన్ని వయో పరిమితి విధిస్తున్నాయి.

ఈ పాలసీ పరిధిలోకి వచ్చే అంశాలు:
*
రోజూ వారి ఆసుపత్రి ఖర్చులు
* ఐ.సి.యూ లో చేరితే అందుకయ్యే ఖర్చులు
* ప్రమాదం కారణంగా కలిగే గాయాలకు చేసే కాస్మోటిక్ శస్ర్త చికిత్సలకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీలు చెల్లిస్తాయి.
* ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక సాధారణ ఆరోగ్య స్థితికి చేరుకునే వరకూ అయ్యే ఖర్చులకు బీమా వర్తిస్తుంది.
* ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక చికిత్సకయ్యే మందులకు, నర్సింగ్ చార్జీలు బీమా కంపెనీలు చెల్లిస్తాయి.

ఆరోగ్య బీమా హామీ మొత్తాన్ని ఎంచుకునే ముందు మ‌హిళ‌లు వారి వ‌య‌సు, జీవిత ద‌శ‌, ఆధార‌ప‌డిన వ్య‌క్తులు, ముందుగా గుర్తించిన వ్యాధులు, నివ‌సిస్తున్న ప్ర‌దేశం వంటి ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని