క‌రోనా కోసం ఎన్‌పీఎస్ నుంచి డ‌బ్బు తీసుకోవ‌చ్చు

క‌రోనా చికిత్స కోసం ఎన్‌పీఎస్ టైర్-1 ఖాతా నుంచి డ‌బ్బు తీసుకునే విధానం.....

Published : 23 Dec 2020 17:19 IST

క‌రోనా చికిత్స కోసం ఎన్‌పీఎస్ టైర్-1 ఖాతా నుంచి డ‌బ్బు తీసుకునే విధానం

పెన్ష‌న్ ఫండ్ నియంత్ర‌ణ సంస్థ (పీఎఫ్ఆర్‌డీఏ) నుంచి పెట్టుబ‌డుదారులు పాక్షికంగా ఉపసంహ‌ర‌ణ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింది. క‌రోనాకు సంబంధించిన వైద్య చికిత్స‌కు అవ‌స‌ర‌మైన ఖ‌ర్చ‌ల కోసం విత్‌డ్రా చేసుకునే స‌దుపాయం ఉంది. ఏప్రిల్ 9, 2020 న దీనికి సంబంధించిన స‌ర్క్కులార్ జారీచేసింది.

ఎవ‌రికోసం తీసుకోవ‌చ్చు?
ఎన్‌పీఎస్ చందాదారుడు, భార్య లేదా భ‌ర్త‌, పిల్ల‌లు (చ‌ట్ట‌ప‌రంగా ద‌త్త‌త తీసుకున్న పిల్ల‌లు), త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా చికిత్స నిమిత్తం ఎన్‌పీఎస్ నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

కావ‌ల‌సిన డాక్యుమెంట్లు:
ఎన్‌పీఎస్ ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకునేందుకు మెడిక‌ల్ స‌ర్టిఫికెట్‌తో పాటు అభ్య‌ర్థ‌న ప‌త్రం కూడా అవ‌స‌రం.

ఎంత తీసుకోవ‌చ్చు?
ఎన్‌పీఎస్ నుంచి వివిధ సంద‌ర్భాల‌లో పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌కు వీలుంది. ఉన్న‌త విద్య‌, వివాహం, ఇళ్లు కొనుగోలు, నిర్థిష్ట‌ వైద్య చికిత్స‌ల కోసం తీసుకోవ‌చ్చు. అయితే ఎంత తీసుకోవ‌చ్చంటే…ఎన్‌పీఎస్ ఖాతాలో అప్ప‌టివ‌ర‌కు చందాదారుడు మాత్ర‌మే డిపాజిట్ చేసిన మొత్తం నుంచి 25 శాతానికి మించ‌కూడ‌దు. అయితే ఎన్‌పీఎస్ ఖాతా ప్రారంభించి మూడు సంవ‌త్స‌రాలు దాటిన వారికే ఈ స‌దుపాయం ఉంటుంది. ఈ తీసుకున్న మొత్తంపై ఎటువంటి ప‌న్ను వ‌ర్తించ‌దు.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక‌రు ఎన్‌పీఎస్ ఖాతా ప్రారంభించి నాలుగేళ్లు అయింది. సంస్థ డిపాజిట్ చేసిన దానితో కాకుండా అత‌డు ఏడాదికి ల‌క్ష రూపాయ‌ల చొప్పున డిపాజిట్ చేశాడు. ఇప్పుడు రూ.4 ల‌క్ష‌ల నుంచి 25 శాతం అంటే ల‌క్ష రూపాయ‌లు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఎన్‌పీఎస్ మొత్తం కాల‌ప‌రిమితిలో గ‌రిష్ఠంగా మూడు సార్లు మాత్ర‌మే పాక్షికంగా డ‌బ్బు తీసుకునేందుకు వీలుంటుంది. అంత‌కుమించి ఎక్కువ‌సార్లు తీసుకునే స‌దుపాయం ఉండ‌దు.

ఎన్‌పీఎస్ ఖాతా నుంచి డ‌బ్బు తీసుకునే విధానం
1)https://www.cra-nsdl.com/CRA/ వెబ్‌సైట్ ద్వారా మీ ఎన్‌పీఎస్ ఖాతాలోకి లాగిన్ కావాలి. యూజ‌ర్ ఐడీ మీకు ఇచ్చిన PRAN ఉంటుంది.

2)ఆ త‌ర్వాత ‘Transact Online’ ట్యాబ్‌లోని 'Withdrawal’‌ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

3)‘Withdrawal’ ఆప్ష‌న్ కింద‌ 'Partial withdrawal from Tier-I’‌ ఎంచుకోవాలి.

  1. అక్క‌డ కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. PRAN నిర్దారించాలి. అది స‌రిగా ఉంటే ‘submit’ పై క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత ప్రాసెస్ కోసం సిస్ట‌మ్ జ‌న‌రేటెడ్ ఫారం, ఇత‌ర డాక్యుమెంట్ల‌ను నోడ‌ల్ ఆఫీస్‌లో ‘submit’ చేయాలి.

5)ఆ త‌ర్వాత కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో PRAN, పేరు, పుట్టిన తేది, ల‌భించే మొత్తం వివ‌రాలు అందులో ఉంటాయి. అక్క‌డ ఎంత తీసుకోవాలో ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. అది 25 శాతానికి మించ‌కూడ‌దు. దీంతో పాటు పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌ల కార‌ణం కూడా తెలిపాలి. ఆ త‌ర్వాత ‘submit’ పై క్లిక్ చేయాలి.

స‌బ్‌మిట్ చేసిన త‌ర్వాత సిస్ట‌మ్-జ‌న‌రేటెడ్ ఫారం డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. దీంతో పాటు మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ జ‌త చేసి నోడ‌ల్ ఆఫీస్‌కు పంపాల్సి ఉంటుంది. నోడ‌ల్ ఆఫీస్ ప్రాసెస్ పూర్తి చేసిన త‌ర్వాత మీ బ్యాంకు ఖాతాలో డ‌బ్బు జ‌మ‌వుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని