Updated : 19 Jan 2021 16:15 IST

అంద‌రి క‌ళ్లు ఫిబ్ర‌వ‌రి 1 పైనే

బ‌డ్జెట్‌కు ముందు జ‌రిపే అంత‌రంగ చ‌ర్చ‌లు ముగియ‌డంతో అంద‌రి క‌ళ్లు ఫిబ్ర‌వ‌రి 1 భార‌త యూనియ‌న్‌ బ‌డ్జెట్ పైనే ఉన్నాయి. భార‌త ఆర్థిక మంత్రిత్వ‌శాఖ‌, ఆర్థికఆ విధానం, దేశ అభివృద్ధిలో కీల‌క పాత్ర వ‌హించే మౌలిక స‌దుపాయాల‌ అభివృద్ధి, అడ్డంకులు లేని సుల‌భతర వ్యాపారం లాంటి ప‌లు విష‌యాల‌పై ప‌లు సూచ‌న‌లు పొందింది. 2021-22 కేంద్ర బ‌డ్జెట్‌ను సిద్ధం చేయ‌డానికి ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ డిసెంబ‌ర్ 30న నిపుణులు, వ్యాపార ప్ర‌ముఖులు, అధికారుల‌తో బ‌డ్జెట్ ముంద‌స్తు సంప్ర‌దింపుల‌ను చ‌ర్చించారు. కొవిడ్-19 ప్ర‌భావంలో ఫిబ్ర‌వ‌రి 1న త‌ను స‌మ‌ర్పించే 3వ బ‌డ్జెట్ ‘ఇంత‌కు ముందెన్న‌డూ లేనిది’గా ఉంటుంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.

ప‌న్నుల విధానంతో స‌హా ఆర్థిక రంగ‌, పెట్టుబ‌డుల్లో ముఖ్య‌పాత్ర పోషించే పెట్టుబ‌డి వాటాదారుల‌ స‌మూహాలు అనేక సూచ‌న‌లు చేశాయి. బాండ్ మార్కెట్లు, బీమా, మౌలిక స‌దుపాయాల వ్య‌యాలు, ఆరోగ్యం, విద్య బ‌డ్జెట్‌, సామాజిక ర‌క్ష‌ణ‌, నైపుణ్య‌త‌, నీటి సంర‌క్ష‌ణ మ‌రియు ప‌రిర‌క్ష‌ణ‌, పారిశుద్ధ్యం, ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌, వ్యాపారం సుల‌భ‌త‌రంగా చేయ‌డం, వివిధ ఉత్ప‌త్తుల‌కు అనుసంధాన పెట్టుబ‌డులు, ఎగుమ‌తులు, స్వ‌దేశీ ఉత్ప‌త్తుల బ్రాండింగ్‌, ప్ర‌భుత్వ రంగ వ‌స్తూత్ప‌త్తి డెలీవ‌రీ విధానాలు, నూత‌న‌ ఆవిష్క‌ర‌ణ‌లు, ప‌ర్యావ‌ర‌ణం పెంపు, కాలుష్య‌ర‌హిత ఇంధ‌నాలు మ‌రియు వాహ‌నాలు లాంటి అన్ని స‌మ‌గ్ర విష‌యాల‌పై వివిధ వ‌ర్గాల నుంచి ఆర్థిక మంత్రిత్వ‌శాఖ స‌మాచారాన్ని, స‌ల‌హాల‌ను, సిఫార్సుల‌ను తీసుకుంది.

వృద్ధికి కీల‌కంగా వ్య‌వ‌హారించే మౌలిక స‌దుపాయాల‌పై 2022 ఆర్ధిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్ దృష్టి సారిస్తుంద‌ని మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. 2020-21లో చాలా మంది ఆర్ధిక వేత్త‌లు ఆర్ధిక వ్య‌వ‌స్థ 7-9% కుదించ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేసిన‌ప్ప‌టికీ, త‌ర్వాత సంవ‌త్స‌రంలో త‌క్కువ వ్య‌వ‌ధిలోనే రెండంకెల వృద్ధి న‌మోదు చేయాల‌ని ఆర్థిక మంత్రిత్వ‌శాఖ భావిస్తోంది.

కోవిడ్‌-19 వ్యాప్తితో భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో 7.5% కుదించింది. అయితే డిసెంబ‌ర్ త్రైమాసికం నుంచి ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో స్వ‌ల్ప వృద్ధిని ఆర్థిక మంత్రిత్వ‌శాఖ ఆశిస్తోంది.

ఆర్థిక మంత్రి, ఆర్థికశాఖ ఉన్న‌తాధికారులు, ప్రీ-బ‌డ్జెట్ సంప్ర‌దింపుల‌లో, పారిశ్రామిక వేత్త‌లు ఆర్థిక వృద్ధికి తోడ్ప‌డ‌డానికి తాజా ఆర్థిక ఉద్దీప‌న‌కు పిలుపునిచ్చారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts