క్రెడిట్ చ‌రిత్రను ఇలా పొందండి 

క్రెడిట్ చరిత్ర లేని దరఖాస్తుదారులకు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి

Updated : 20 Jan 2021 12:56 IST

క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తికి రుణాలు ఇచ్చే విష‌యంలో బ్యాంకులు చాలా జాగ్ర‌త్త వ‌హిస్తాయి. క్రెడిట్ కార్డ్ కంపెనీలు కూడా దీనిని అనుస‌రిస్తాయి. క్రెడిట్ బ్యూరోలు అటువంటి దరఖాస్తుదారులను అంచనా వేయడానికి బ్యాంకులకు వివ‌రాల‌ను అందిస్తాయి. అయితే, అన్ని బ్యాంకులు క్రెడిట్ బ్యూరోల స‌మాచారాన్ని ఆధారంగా ఏమి చేసుకోవు. 

బ్యూరోలు క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తుల డేటాను,  అదే ప్రొఫైల్ ఉన్న ఇతర వ్యక్తులతో పోల్చి దాని ఆధారంగా దరఖాస్తుదారునికి స్కోరును కేటాయిస్తారు. వారు వయస్సు, స్థానం, ఉద్యోగ ప్రొఫైల్, పరిశ్రమ, సంవత్సరాల అనుభవం, హోదా వంటి డేటా ఉపయోగిస్తారు.

క్రెడిట్ చరిత్ర లేని దరఖాస్తుదారులకు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి.

క్రెడిట్ చరిత్రను నిర్మించడానికి మార్గాలు:

 కార్డులు, రుణాలు జారీ చేసే ఆన్‌లైన్ అగ్రిగేటర్లలోకి లాగిన్ అవ్వడం ద్వారా క్రెడిట్ హిస్ట‌రీని తెలుసుకోవ‌చ్చు . మీ ప్రొఫైల్ ఆధారంగా, ఈ అగ్రిగేటర్లు మీ వివరాలను బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలకు (ఎన్‌బిఎఫ్‌సి) పంపుతాయి. సంస్థలకు ఆసక్తి ఉంటే మీకు మార్కెటింగ్ కాల్స్  వ‌స్తాయి, చాలా సంస్థలు వివిధ‌ పత్రాలను అడుగుతాయి.

క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తులు వారి తల్లిదండ్రులు లేదా దగ్గరి బంధువులతో యాడ్-ఆన్ కార్డు తీసుకోవచ్చు. యాడ్-ఆన్ కార్డ్ మీ ఆర్థిక లావాదేవీలను లెక్కిస్తుంది, క్రెడిట్ ప్రొఫైల్‌ను రూపొందించడంలో మీకు సహాయపడుతుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) పై క్రెడిట్ కార్డు తీసుకోవడం మరో ఎంపిక. మీరు బ్యాంకుతో రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్‌డిని తెరిస్తే, బ్యాంకు మీకు ఎఫ్‌డికి క్రెడిట్ కార్డును అందిస్తాయి. పరిమితి మీరు కలిగి ఉన్న డిపాజిట్‌కు దగ్గరగా ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) ఆధారంగా క్రెడిట్ కార్డును జారీ చేయడం బ్యాంకులు సౌకర్యవంతంగా ఉంటాయి, ఎందుకంటే వ్యక్తి రుణం  చెల్లించ‌క‌పోతే ఎఫ్‌డీ హామీగా ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్యక్తి బ్యాంకులో రూ. 20,000  ఎఫ్‌డిని ప్రారంభించాడు. బ్యాంక్, సాధారణంగా, క్రెడిట్ కార్డుపై 90 శాతం క్రెడిట్ పరిమితిని ఇస్తుంది. అంటే డిపాజిటర్‌కు రూ. 18,000 క్రెడిట్ పరిమితి ఉన్న కార్డు లభిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో, మీకు ముందస్తు క్రెడిట్ చరిత్ర ఉండవలసిన అవసరం బ్యాంకుకు లేదు.
 అటువంటి కార్డును ఉపయోగించడం , సమయానికి తిరిగి చెల్లించడం ప్రారంభించిన తర్వాత, అతను కాలక్రమేణా క్రెడిట్ చరిత్రను నిర్మించడం ప్రారంభమ‌వెతెంది. క్రెడిట్ స్కోరును కేటాయించినప్పుడు చాలా క్రెడిట్ బ్యూరోలు ఒకటి లేదా రెండు సంవత్సరాల చరిత్రను పరిగణనలోకి తీసుకుంటాయి.

సాధారణ ఆదాయం లేని ఫ్రీలాన్సర్లకు సురక్షిత క్రెడిట్ కార్డులు కూడా మంచి ఎంపిక. క్రెడిట్ చరిత్ర లేకపోతే బ్యాంకులు సాధారణంగా అలాంటి ప్రొఫైల్‌కు రుణాలు ఇవ్వవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని