Updated : 05 Jan 2022 15:18 IST

Cashless insurance: కార్ల‌కు న‌గ‌దు ర‌హిత బీమా.. ప్రయోజనాలివే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా సంస్థ‌ల ప‌రిధిలో ఎలా నెట్‌వ‌ర్క్ హాస్పిటల్స్‌ ఉంటాయో.. కారు బీమా సంస్థ‌ల ప‌రిధిలో నెట్‌వ‌ర్క్ గ్యారేజీలు ఉంటాయి. బీమా సంస్థలతో అనుసంధానం అయి ఉండే వీటిని నెట్‌వ‌ర్క్ గ్యారేజీలంటారు. బీమా చేసిన వ్య‌క్తి ద‌గ్గ‌ర డ‌బ్బు తీసుకోకుండానే క్లెయిమ్‌కు వ‌చ్చిన‌పుడు గ్యారేజ్ వ‌ద్ద కార్లు రిపేర్ చేస్తాయి. రిపేరింగ్ ఖ‌ర్చును బీమా సంస్థ భ‌రిస్తుంది. క్లెయిమ్ ప్రక్రియ చాలా సుల‌భంగా ఉండ‌టమే కాకుండా అవాంత‌రాలు లేకుండా ఉంటుంది. అటువంటి నెట్‌వ‌ర్క్ గ్యారేజీల లిస్ట్ బీమా సంస్థ‌నే అందిస్తుంది. ఒక‌వేళ బీమా చేయించుకున్న త‌ర్వాత ఈ గ్యారేజీల లిస్ట్ వాళ్ల ద‌గ్గ‌ర లేక‌పోతే ప్ర‌మాదం జ‌రిగినప్పుడు స‌మీపంలో ఉన్న ఈ గ్యారేజీల వివ‌రాల‌ను పొంద‌డానికి బీమా సంస్థ టోల్‌-ఫ్రీ నంబ‌ర్ లేదా క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్‌ను సంప్ర‌దించొచ్చు.

ఆరోగ్య బీమా ప్లాన్ల కోసం న‌గ‌దు ర‌హిత క్లెయిమ్‌ల మాదిరిగానే, చాలా మోటారు బీమా సంస్థ‌లు న‌గ‌దు ర‌హిత కారు బీమా పాల‌సీల‌ను అందిస్తున్నాయి. నెట్‌వ‌ర్క్ గ్యారేజీలు బీమా చేసిన వారికి సేవ‌ల ప‌రంగా ప్రాధాన్య‌ం ఇస్తాయి. ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి చెల్లింపు ప్ర‌క్రియ కూడా గ్యారేజీల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. సాంకేతిక మార్పులు, ఇంట‌ర్నెట్ సౌక‌ర్యాలు పెరిగిన‌ కార‌ణంగా కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్‌లో కొనుగోలు మునుప‌టి కంటే సుల‌భంగా మారింది. ఈ రోజుల్లో వేర్వేరు కంపెనీల కారు బీమా ప్లాన్‌లు ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవ‌చ్చు. ఏదైనా ప్ర‌మాదం లేదా దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితుల్లో బీమా చేసిన వ్య‌క్తిని ఆర్థికంగా ఆదుకోవ‌డంలో కారు బీమా ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంద‌ని ఇన్సూరెన్స్ విశ్లేష‌కులు తెలిపారు. న‌గ‌దు ర‌హిత కారు బీమా ప్ర‌జ‌ల్లో బ‌హుళ ఆద‌ర‌ణ పొంద‌నుంది. ఎందుకంటే ఈ బీమా తీసుకున్న వారు ఇప్పుడు త‌మ జేబు నుంచి డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేకుండా సేవ‌ల‌ను పొందొచ్చు. క్యాష్‌లెస్ కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు.. క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల మాదిరిగానే, ఇన్సూర‌ర్ నేరుగా కారు డ్యామేజ్ ఖ‌ర్చుల‌ను పెట్టుకుంటారు. కాబ‌ట్టి అవాంత‌రాలు లేకుండా బీమా సేవ‌లు అందుతాయి.

కారు బీమా చేసిన వ్య‌క్తి.. కారు ప్ర‌మాదానికి గుర‌యిన‌పుడు ఏదైనా భాగాలు డ్యామేజ్ జ‌రిగిన‌పుడు ప్ర‌మాద వివ‌రాల‌ను బీమా కంపెనీకీ తెల‌పాలి. ఆపై పాల‌సీదారు దెబ్బ‌తిన్న కారు త‌నిఖీ కోసం నెట్‌వ‌ర్క్ గ్యారేజీకి తీసుకెళ్లాలి. ఈ గ్యారేజీలు పాల‌సీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న పాల‌సీ నిబంధ‌న‌లు, క‌వ‌రేజీ కింద బీమా చేసిన‌ వారి కారును రిపేర్ చేసి, ఆపై మ‌ర‌మ్మతు రేట్ల ధ‌ర‌ల ఇన్‌వాయ‌స్‌ను కారు బీమా పాల‌సీ చేసిన బీమా సంస్థ‌కు పంపుతాయి. ధ్రువీకరణ త‌ర్వాత కారు బీమా సంస్థ నుంచి ఈ నెట్‌వ‌ర్క్ గ్యారేజీల‌కు చెల్లింపులు చేస్తారు. అయితే ఈ ప్లాన్ కింద క‌వ‌ర్ కాని కొన్ని భాగాలు లేదా మ‌ర‌మ్మ‌తులు ఉంటాయ‌ని గ‌మ‌నించాలి. ఈ బీమా పాల‌సీల‌ను, క‌వ‌రేజీని అర్థం చేసుకోవడానికి పాల‌సీ క‌వ‌రేజీ డాక్యుమెంట్‌ని ముందుగానే చ‌దివి అర్థం చేసుకోవాలి.

న‌గ‌దు ర‌హిత క్లెయిమ్ ఇలా.. 

1.కారుకు ఏదైనా న‌ష్టం జ‌రిగితే మీ బీమా సంస్థ‌కు తెలియ‌జేయాలి.

2. కారును స‌మీపంలోని నెట్‌వ‌ర్క్ గ్యారేజీకి తీసుకెళ్లొచ్చు. లేదా అక్క‌డికి తీసుకెళ్ల‌డానికి బీమా సంస్థ లేదా కారు గ్యారేజ్ నుంచి సాయం తీసుకోవచ్చు.

3. అవ‌స‌ర‌మైన పాల‌సీ సంబంధిత ప‌త్రాల‌ను పూరించి, న‌గ‌దు ర‌హిత మ‌ర‌మ్మ‌తు ఆమోదం కోసం వాటిని బీమా కంపెనీకి పంపించాలి.

4. ఈ ప‌త్రాలు ధ్రువీకరించిన తర్వాత బీమా సంస్థ నెట్‌వ‌ర్క్ గ్యారేజీకి చెల్లింపులు చేస్తుంది.

ప్ర‌యోజ‌నాలు

పాల‌సీదారులు త‌మ జేబులోంచి న‌గ‌దు చెల్లించ‌కుండానే త‌మ కార్ల‌ను రిపేర్ చేయించుకోవ‌చ్చు. అంతేకాకుండా నెట్‌వ‌ర్క్ గ్యారేజీలు బీమా చేసిన వారికి సేవ‌ల ప‌రంగా ప్రాధాన్య‌ం ఇస్తాయి. చెల్లింపు ప్ర‌క్రియ గ్యారేజీల‌కు కూడా సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. క్లెయిమ్ సెటిల్‌మెంట్, రీయింబ‌ర్స్‌మెంట్ ప్ర‌క్రియ కంటే చాలా వేగంగా ఉంటుంది. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో మోసం జ‌రిగే అవ‌కాశం ఉండ‌ద‌ని నిపుణులు అంటున్నారు. బీమా సంస్థ స‌ర్వేయ‌ర్‌ మొద‌టి నుంచి నేరుగా క్లెయిమ్ ప్ర‌క్రియ‌లో పాల్గొంటారు. రిపేర్ ప్రారంభంలో ఎంచుకున్న అంచ‌నాల ప్ర‌కారం బిల్లింగ్ చేస్తారు. కాబ‌ట్టి బిల్లింగ్ వ్య‌వ‌హారం అంతా న‌మ్మ‌ద‌గిన‌దిగా ఉంటుంది. క్లెయిమ్ స‌మ‌యంలో స‌ర్వేయ‌ర్.. కారును ప‌రిశీలించి, న‌ష్టాన్ని అంచ‌నా వేయొచ్చు. పెద్ద ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు స‌ర్వేయ‌ర్.. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాన్ని కూడా ప‌రిశీలిస్తారు. అయితే, కారుకి జ‌రిగే కొన్ని న‌ష్టాల‌కు, కారులో ఉండే అద‌న‌పు ప‌రిక‌రాల‌కు ప్ర‌తి దానికీ క్లెయిమ్ చేయ‌డానికి అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు. బీమా ఆఫ‌ర్ డాక్యుమెంట్‌ని బీమాదారుడు చ‌దివి అర్థం చేసుకోవాలి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని